AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: ‘మీ ప్రేమకు కృతజ్ఞతలు.. ఈ గాయాలు పనిలో భాగమే’.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న సైఫ్..

ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్.. దేవర చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ కమర్షియల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆసక్తిని పెంచాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం చిత్రీకరణలో సైఫ్ గాయపడడంతో అతడి పాత గాయం మళ్లీ ఎక్కువైంది.

Saif Ali Khan: 'మీ ప్రేమకు కృతజ్ఞతలు.. ఈ గాయాలు పనిలో భాగమే'.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న సైఫ్..
Saif Ali Khan
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2024 | 8:16 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మోచేతి సమస్యతో ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ‘దేవర’ మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్న సైఫ్.. ఇటీవల షూట్ సమయంలో గాయపడ్డారు. దీంతో ఆయన మోకాలు, భుజానికి గాయాలు కావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. సోమవారం సైఫ్ అలీ ఖాన్ భూజానికి శస్త్రచికిత్స జరిగినట్లుగా తెలుస్తోంది. అనంతరం… ఈరోజు తన భార్య కరీనా కపూర్ తో కలిసి ఇంటికి చేరుకున్నారు. తనను చూసేందుకు అభిమానులు రాగా.. ఇంట్లో నుంచే అభివాదం చేశారు. తనపై ఇంతగా ప్రేమను చూపిస్తూ.. కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సైఫ్. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సైఫ్ మాట్లాడుతూ.. “ఈ గాయాలు, శస్త్రచికిత్స అన్ని నేను చేసే పనిలో భాగమే. ప్రస్తుతం ఇంత ఆధునాతన వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు” అని అన్నారు సైఫ్.

ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్.. దేవర చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ కమర్షియల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆసక్తిని పెంచాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం చిత్రీకరణలో సైఫ్ గాయపడడంతో అతడి పాత గాయం మళ్లీ ఎక్కువైంది. దీంతో అతడు ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరాడు. మోచేతికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఈరోజు సైఫ్ ను డిశ్చార్జ్ చేశారు. గతంలో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన రంగూన్ సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ మోచేతికి బలమైన గాయమైంది. ఇప్పుడు అదే గాయం దేవర యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా.. ఆ పాత గాయమే ఎక్కువయ్యింది.

ఇదిలా ఉంటే.. సైఫ్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో త్వరగా కోలుకోవాలంటూ దేవర చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఆయనను సెట్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొంది. దేవర షూటింగ్ సమయంలో ప్రమాదం జరగ్గా సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయని.. అందుకే ఆయన ఆసుపత్రిలో చేరారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటిని సైఫ్ ఖండించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సైఫ్. ఇప్పుడు దేవర సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.