Sai Pallavi: ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసిన పూజ కన్నన్.. సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా ?..
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఆమె చెల్లెలు పూజ కన్నా తన ప్రియుడు వినీత్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే పూజ, వినీత్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను పూజా తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. పెద్ద కుటుంబం, నిండు హృదయాలు, నా గుండెలో లేని చాలా ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చింది పూజ.. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే పెళ్లి ఎప్పుడు ?.. కాబోయే భర్తకు సంబంధించిన మరే వివరాలు వెల్లడించలేదు.