Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిట్రెస్.. ఇప్పుడేమో స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా మంది వివిధ రకాల పనులు/ ఉద్యోగాలు చేసిన వారే. పాకెట్ మనీ కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడడం ఇష్టం లేక చిన్న చిన్న జాబులు చేసిన వారే. ఈ స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

పై ఫొటోలో మెహందీ పెట్టించుకున్న అమ్మాయిని గుర్తు పట్టారా? తను ఓ స్టార్ హీరో కూతురు. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. నిజం చెప్పాలంటే.. బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది. తండ్రి స్టార్ హీరో.. పెద నాన్న స్టార్ ప్రొడ్యూసర్ పెద్దమ్మ స్టార్ హీరోయిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే వీరి ఫ్యామిలీలో చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వారే. సాధారణంగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి తన సొంత కాళ్లపైనే నిలబడాలనుకుంది. అందుకే చదువుకునేటప్పుడు పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పనులు చేసింది. అందులో భాగంగానే చైనీస్ రెస్టారెంట్ లో వెయిట్రెస్ గా పని చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందీ స్టార్ కిడ్. మొదటి సినిమా నిరాశపర్చినా డీలా పడలేదు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సినిమాలకు క్రమంగా దూరమైంది. అయితే తన ఫ్యాషన్ సెన్స్ తో ఇప్పటికీ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరనుకునేరు? బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్.
హీరోయిన్ గా అరంగేట్రం చేయడానికి ముందు, సోనమ్ కపూర్ సింగపూర్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో చదువుతున్నప్పుడు చైనీస్ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసేది. తరువాత ఆమె తూర్పు లండన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
సోనమ్ కపూర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సోనమ్ కపూర్ 2007 లో సావరియా చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నీర్జా, సంజు, భాగ్ మిల్కా భాగ్, రాంజన్నా, ప్యాడ్ మ్యాన్ తదితర సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2018లో సోనమ్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాను వివాహం చేసుకుంది. 2020లో ఈ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








