AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandezs: స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో జాక్వెలిన్ తల్లి కన్నుమూత..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె తల్లి ఈరోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె అంత్యక్రియలు కేవలం కుటుంబసభ్యలు సమక్షంలో మాత్రమే జరగనున్నట్లు తెలుస్తోంది.

Jacqueline Fernandezs: స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో జాక్వెలిన్ తల్లి కన్నుమూత..
Jacqueline Fernandezs
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2025 | 12:41 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి ఈరోజు గుండెపోటుతో మరణించారు.ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ అనారోగ్య సమస్యలతో కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్త జాక్వెలిన్, ఆమె కుటుంబాన్ని జీవితాంతం బాధలో ముంచెత్తింది. ఆమె అంత్యక్రియలు సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా జరుగుతాయని సమాచారం. మార్చి 24న, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ గుండెపోటుతో లీలావతి ఆసుపత్రిలోని ఐసియులో చేరారు.

ఈ వార్త విన్న వెంటనే జాక్వెలిన్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి తిరిగి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఆమె తన తల్లికి దగ్గరగా ఉంటూ తన తల్లికి సేవలు చేసింది. మార్చి 26న గౌహతిలో జరిగే ఐపీఎల్ వేడుకలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తల్లిని చూసేందుకు జాక్వెలిన్ ఐపీఎల్ ఆఫర్ వదులుకుంది.

గతంలో 2022లోనూ జాక్వెలిన్ తల్లి కిమ్ గుండెపోటుతో బహ్రెయిన్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లోని మనామాలో నివసిస్తున్నారు. ఆమెకు మలేషియా, కెనడియన్ వారసత్వం ఉంది. ఆమె తల్లి తరపు తాత కెనడాకు చెందినవారు. ఆమె ముత్తాతలు భారతదేశంలోని గోవాకు చెందినవారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..