Hina Khan: ఇప్పటికే క్యాన్సర్‌తో పోరాటం.. మరో భయంకరమైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. సాయం చేయాలని వేడుకోలు
బాలీవుడ్ ప్రముఖ బుల్లితెర నటి హీనా ఖాన్ ప్రస్తుతం తన జీవితంలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితమే ఈ అందాల తారకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి చికిత్స పొందుతోంది కూడా. హీనా ఖాన్ ప్రస్తుతం కీమోథెరపీ ట్రీట్ మెంట్ చేయించుకుంటోంది. తన చికిత్స, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ ఇస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ బుల్లితెర నటి హీనా ఖాన్ ప్రస్తుతం తన జీవితంలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితమే ఈ అందాల తారకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి చికిత్స పొందుతోంది కూడా. హీనా ఖాన్ ప్రస్తుతం కీమోథెరపీ ట్రీట్ మెంట్ చేయించుకుంటోంది. తన చికిత్స, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ ఇస్తోంది. ఇప్పుడు కూడా, హీనా ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసి, తాను మరో వ్యాధిన బారిన పడినట్లు తెలిపింది. కీమోథెరపీ దుష్ప్రభావాల కారణంగా తన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు ఎమోషనలైందీ అందాల తార. కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మ్యూకోసిటిస్‌తో బాధపడుతోంది హీనా ఖానా. ‘ఒక వైపు కీమోథెరపీ.. మరోవైపు మ్యూకోసిటిస్. దీనికి చికిత్సగా వైద్యులు కొన్ని సూచనలు ఇచ్చారు. కానీ మీలో ఎవరైనా ఈ వ్యాధిని ఎదుర్కొన్నట్లయితే, సమర్థవంతమైన మందులు, సూచనలు చెప్పండి. నాకు ఇది చాలా బాధాకరమైన ప్రయాణం. కనీసం ఏమీ తినలేకపోతున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది హీనా ఖాన్.
.హీనా ఖాన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చాలా మంది నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో ‘సరైన చికిత్స పొందండి.. తప్పుడు సలహాల వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది’ అని కొందరు స్పందించారు. మ్యూకోసిటిస్ వ్యాధి వచ్చినప్పుడు నోటిపూత ఏర్పడుతుంది.
హీనా ఖాన్ లేటెస్ట్ ఫొటో..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ సీరియల్‌తో హీనా ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కసౌతీ జిందగీ కి 2’ సీరియల్ హీనా పాపులారిటీని మరింత పెంచింది. ఇది కాకుండా, హీనా అనేక సీరియల్స్‌లో గెస్ట్ స్టార్‌గా కూడా నటించింది. హీనా ‘చాంద్ చూపా బాదల్ మే’ , ‘సప్నా బాబుల్ కా’ సీరియల్స్‌లో కూడా కనిపించింది. హీనా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కేన్సర్ కుచికిత్స తీసుకుంటూనే ఓ యాడ్ షూట్‌కి వెళ్లిందని. ఈ సమయంలో తనకు శస్త్ర చికిత్స జరిగిన విషయాన్ని వెల్లడించింది.
వెకేషన్ లో హీనా ఖాన్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.