AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dipika Kakar:పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రముఖ నటి

సాధారణంగా సినిమా హీరోయిన్ల పెళ్లయ్యాక తమ నటనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తుంటారు. మరికొంతమంది పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక యాక్టింగ్‌కు గుడ్‌ బై చెప్పేస్తుంటారు. ఈక్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటి దీపికా కక్కర్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

Dipika Kakar:పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రముఖ నటి
Actress Deepika Kakkar
Basha Shek
|

Updated on: May 29, 2023 | 9:19 PM

Share

సాధారణంగా సినిమా హీరోయిన్ల పెళ్లయ్యాక తమ నటనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తుంటారు. మరికొంతమంది పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక యాక్టింగ్‌కు గుడ్‌ బై చెప్పేస్తుంటారు. ఈక్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటి దీపికా కక్కర్‌ కూడా ఇలాంటి సంచలన నిర్ణయమే తీసుకుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమె తన ఫ్యామిలీకి, పుట్టబోయే బిడ్డ కోసం తగిన సమయం కేటాయించడం కోసం యాక్టింగ్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించింది. ‘ప్రస్తుతం నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తున్నాను. తల్లి కాబోతున్నానన్న ఫీలింగ్‌ ఎంతో బాగుంది. పెళ్లైన ఐదేళ్ల తర్వాత మేం అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందుతున్నాం. ఈ ఎగ్జయిట్‌మెంట్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంది. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు మేకప్‌ వేసుకోవడం ప్రారంభించాను. 10-15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాను. నా ప్రెగ్నెన్సీ ప్రయాణం మొదలవగానే షోయబ్‌కి చెప్పా. నాకు పని చేయడం ఇష్టం లేదని.. నటనకు స్వస్తి చెప్పి.. ఒక గృహిణిగా, తల్లిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది దీపిక. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంచి నిర్ణయం తీసుకుంటున్నావంటూ చాలామంది ఆమెను సమర్థిస్తున్నారు.

కాగా బాలీవుడ్ బుల్లితెర నటి దీపికా కక్కర్ మొదట జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఎయిర్ హూస్టెస్ గా కెరీర్‌ ప్రారంభించింది. అయితే అనారోగ్యం కారణం తో ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.. దీంతో పాటు యాక్టింగ్ పై కూడా దృష్టి సారించింది. ఆమె నటించిన ‘ససురాల్ సిమర్ కా’ బాలీవుడ్ పాపులర్ సీరియల్‌ లో ఒకటిగా నిలిచింది. ఇందులో దీపికా కక్కర్ నటనకు పలువురి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత పలు ధారావాహికలు, రియాల్టీ షోలో పాల్గొంది బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత ‘పల్టాన్’ ద్వారా వెండితెరపై రంగ ప్రవేశం చసింది. ఈక్రమంలోనే తన సహనటుడు షోయబ్ ఇబ్రహీంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. షోయబ్ ముస్లిం కావడంతో దీపిక కూడా ఆ మతంలోకి మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తనపేరు ఫైజా గా మార్చుకుంది. 2018లో షోయబ్‌ను పెళ్లి చేసుకున్న దీపిక.. సుమారు ఐదేళ్ల తర్వాత గర్భం ధరించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

View this post on Instagram

A post shared by Dipika (@ms.dipika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.