‘ఇలాంటి సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. జనాలేమైనా పిచ్చోళ్లా’.. ప్రముఖ దర్శకుడిపై కంగనా ఫైర్‌

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌ కంగనా తన ముక్కుసూటి తనంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ పై నటి కంగనా రనౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ మువీని విమర్శిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటించిన ఈ మువీ జులై 28న థియేటర్లలో విడుదలైన సంగతి..

'ఇలాంటి సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. జనాలేమైనా పిచ్చోళ్లా'.. ప్రముఖ దర్శకుడిపై కంగనా ఫైర్‌
Kangana Ranaut
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 30, 2023 | 7:12 AM

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌ కంగనా తన ముక్కుసూటి తనంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ పై నటి కంగనా రనౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ మువీని విమర్శిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటించిన ఈ మువీ జులై 28న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కరణ్‌ని ఉద్దేశిస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు..

ప్రేక్షకులను ఇక మోసం చెయ్యలేరు. ఇలాంటి ఫేక్‌ సెట్స్‌, ఫేక్‌ కాస్ట్యూమ్స్‌తో తీసిన సినిమాలను వాళ్లు అంగీకరించరు. నిజ జీవితంలో ఇలాంటి దుస్తులు ఎవరైనా ధరిస్తారా? 90ల్లో నేను తెరకెక్కించిన చిత్రాలనే కాపీ కొట్టినందుకు కరణ్‌ సిగ్గుపడాలి. పైగా 3 గంటల డైలీ సీరియల్‌కు రూ.250 కోట్లు ఖర్చుపెట్టాడు. టాలెంట్‌ ఉన్నవాళ్లకు బడ్జెడ్‌ దొరక్క ఇబ్బందిపడుతుంటే ఆయనకు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బును వృధా చేయడం అంతమంచిపని కాదు. ఇకనైనా డైరెక్షన్‌ చేయడం ఆపేయ్‌. నువ్వు రిటైర్‌ అయిపో.. టాలెంట్‌ ఉన్న కొత్త నిర్మాతలకు అవకాశం ఇవ్వు అంటూ కోరారు. అలాగే రణ్‌వీర్‌కు డ్రెస్సింగ్‌ సెన్స్‌పై కంగనా కొన్ని సూచనలు చేశారు. ‘రణ్‌వీర్‌ నీకు నేనిచ్చే సలహా ఒక్కటే డ్రెస్సింగ్‌ విషయంలో దయచేసి కరణ్‌ను ఫాలో అవ్వద్దొ. సాధారణ వ్యక్తుల మాదిరిగా డ్రెస్సింగ్‌ చేసుకోవడానికి ప్రయత్నించు. దక్షిణాది హీరోలు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూసి నేర్చుకో. వారెప్పటికీ మన దేశ సంస్కృతిని నాశనం చెయ్యరంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక సినిమా విషయాలకొస్తే కంగనా ఎమర్జెన్సీ, చంద్రముఖి-2, తేజస్‌ మువీలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!