- Telugu News Photo Gallery Cinema photos BRO movie: Sai Dharam Tej shares emotion tweet about Pawan Kalyan saya 'What do i call this day'
Throwback Photo: ‘అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ.. ఈ రోజును ఏమని పిలవాలి! నాకు అన్నీ నువ్వే’.. గుర్తుపట్టారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆడుకుంటున్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా? వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఈ రోజే విడులైందండి. ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు. అవును.. మురిపెంగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో ఆడుకుంటున్న పవన్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ఫొటో ఎవరు పోస్ట్ ..
Updated on: Jul 28, 2023 | 10:27 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆడుకుంటున్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా? వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఈ రోజే విడులైందండి. ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు. అవును.. మురిపెంగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో ఆడుకుంటున్న పవన్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ఫొటో ఎవరు పోస్ట్ చేశారు? ఎక్కడిది అనేగా మీ సందేహం..! తెలుసుకుందాం రండి..

దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం 'బ్రో' జులై 28న థియేటర్లలో విడుదలై బాగా ఆకట్టుకుంటోంది. పవన్, సాయిధరమ్ తేజ్ ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మువీ ఇప్పటికే అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది. ఈ రోజు ఈ మువీ విడుదలసందర్భంగా సాయి తేజ్ తన ట్విటర్ ఖాతాలో పవన్‌తో ఉన్న త్రోబ్యాక్ ఫొటో షేర్ చేశాడు. అంతేకాకుండా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు. మావయ్య పవన్ కల్యాన్‌పై తనకున్న ప్రేమను, అభిమానాన్నంతటినీ మరోమారు ఒలకబోశాడు. ఇంతకీ అందులో ఏముందంటే..

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. ఈ రోజును ఏమని పిలవాలి.? నా కల నెరవేరిన రోజు.. మర్చిపోలేని రోజు.. జీవితంలో గుర్తుండిపోలేని ఓ మధరు జ్ఞాపకం. నా మనసులోని భావాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గురువు, మామయ్య, మామ నాకు అన్నీ పవన్ కల్యాన్ మావయ్యే. ఆయన్ని చూస్తూ ఎదిగాను. ఇప్పటికీ ఆయన చేతిని పట్టుకుని నడుస్తున్న చిన్నపిల్లవాడినే. త్రివిక్రమ్ గారూ నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ. నన్ను నమ్మి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

నా ముగ్గురు మామలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అందరు హీరోలు, సినీ అభిమానులు మీ అందరి ప్రేమాభినాలు, సపోర్ట్ వల్లనే నన్ను నడిపిస్తున్నాయి. నాకన్నా ఈ 'బ్రో' మీకే మీకే సొంతం. ఈ మువీ మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. నా కల నేరవేర్చడంలో భాగమైన ప్రతిఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు అంటూ సాయిధరమ్ తేజ్ సుదీర్ఘలేఖ రాసుకొచ్చాడు.

'బ్రో' మువీలో హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. తమిళంలో బ్లాక్ బాస్టర్ అందుకున్న ‘వినోదయ సిత్తం’ సినిమాకి రీమేక్‌గా ‘బ్రో’ రూపొందించారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.





























