Tollywood : ఈ అందాల నాట్య మయూరి ఎవరో గుర్తుపట్టరా ?.. అప్పట్లో బాలీవుడ్‏ను షేక్ చేసిన స్టార్ హీరోయిన్..

డ్యాన్సర్‏గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి ఆ తర్వాత అగ్రకథానాయికగా సినీపరిశ్రమను ఏలేసింది. 1963, 1965లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీప్రియులను అలరించింది. కానీ దక్షిణాది చిత్రాల్లో మాత్రం సహాయక పాత్రలలో నటించింది మెప్పించింది. కానీ ఆమె ముందుగా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొంది. కానీ చివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఎవరో గుర్తుపట్టరా ?..

Tollywood : ఈ అందాల నాట్య మయూరి ఎవరో గుర్తుపట్టరా ?.. అప్పట్లో బాలీవుడ్‏ను షేక్ చేసిన స్టార్ హీరోయిన్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 29, 2023 | 10:02 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ అందాల నాట్య మయూరి ఎవరో గుర్తుపట్టరా ?.. డ్యాన్సర్‏గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి ఆ తర్వాత అగ్రకథానాయికగా సినీపరిశ్రమను ఏలేసింది. 1963, 1965లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీప్రియులను అలరించింది. కానీ దక్షిణాది చిత్రాల్లో మాత్రం సహాయక పాత్రలలో నటించింది మెప్పించింది. కానీ ఆమె ముందుగా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొంది. కానీ చివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఎవరో గుర్తుపట్టరా ?..ఆమె అందాల నటి హేమమాలిని. 80లో నుంచి ఇప్పటివరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఓవైపు నటిగా.. మరోవైపు రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. భారతదేశంలోని అత్యంత విజయవంతమైన శాస్త్రీయ నృత్యకారిణి.

1948 అక్టోబర్ 16న తమిళనాడులోని అమ్మన్ కుడిలో జన్మించింది హేమమాలిని. పదవ తరగతి వరకు చదివిన ఆమె.. ఆ తర్వాత డాన్స్ నేర్చుకోవడానికి సమయం కేటాయించింది. నటనపై ఆసక్తితో చదువును మధ్యలో వదిలేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సౌత్ సినిమాల్లో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి.. 1963 నుంచి 1965లో పలు దక్షిణాది సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ప్రధాన కథానాయికగా అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు పలువురు దర్శకులు ఆమెను రిజెక్ట్ చేశారు. ఆమె అసలు హీరోయిన్ మెటిరియల్ కాదంటూ అవమానించారు. అయినప్పటికీ ఆమె పట్టుదల వదలకుండా ప్రయత్నాల కోసం ట్రై చేసింది.

ఇవి కూడా చదవండి
Hema Malini

Hema Malini

కెరీర్ తొలినాళ్లలో ఆమె తమిళంలో ఓ సినిమా కోసం అగ్రిమెంట్ జరిగింది. కానీ సినిమా స్టార్ట్ అయ్యే సమయంలో ఆమెను తొలగించి అసలు హీరోయిన్ మెటిరియల్ కాదంటూ అవమానించారు. అతను అలా అనడంతో చాలా బాధపడ్డానని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది హేమమాలిని. అతని మాటలను ఛాలెంజ్ గా తీసుకుని తన తదుపరి అడిషన్స్ లో బెస్ట్ ఇచ్చానని… అదే సమయంలో రాజ్ కపూర్ నటించిన సప్నో కే సౌదాగర్ సినిమాలో తొలి అవకాశం వచ్చిందని.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన హేమమాలిని మాత్రం అదృష్టం కలిసోచ్చింది.

Hema Malini 2

Hema Malini 2

1972లో విడుదలైన సీతా ఔర్ గీత సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేసింది. ఆ తర్వాత 1975లో వచ్చిన షోలే చిత్రం ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అలాగే 1977లో విడుదలైన డ్రీమ్ గర్ల్ సినిమా హేమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సాధించిన సినిమా. ఈ సినిమా తర్వాతే ఆమెకు డ్రీమ్ గర్ల్ అనే పేరు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.