AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగు వాళ్లు ఇంతే బ్రో.. నచ్చితే అస్సలు వదలరు..

మన తెలుగు ఆడియన్స్ మహా మంచోళ్లబ్బా.. ఒక్కసారి నచ్చారంటే చాలు నెత్తిన పెట్టుకుంటారు.. వాళ్లు మన ఇండస్ట్రీనా కాదా అని కూడా చూడరు. దుల్కర్ సల్మాన్‌కు ఇప్పుడిలాంటి ప్రేమే టాలీవుడ్‌లో దక్కింది. మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మన ఆడియన్స్‌కి బాగా చేరువైపోయారు దుల్కర్. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ మూడో తెలుగు సినిమాకు ముహూర్తం పెట్టారీయన.

Tollywood: తెలుగు వాళ్లు ఇంతే బ్రో.. నచ్చితే అస్సలు వదలరు..
Dhanush, Dulquer Salmaan
Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 29, 2023 | 9:27 PM

Share

టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఉంది కానీ హీరోలకు మాత్రం కొరతే లేదు.. ఒక్కరో ఇద్దరో కాదు దాదాపు అర డజన్ మంది స్టార్ హీరోలు.. డజన్ మంది మీడియం రేంజ్ హీరోలున్నారు. వాళ్లే ఫుల్ బిజీగా ఉంటారెప్పుడూ. అలాంటిదిప్పుడు ఉన్న వాళ్లు సరిపోవట్లేదంటూ పక్క ఇండస్ట్రీకి వెళ్లి కథలు చెప్పి వాళ్లనిక్కడికి తీసుకొస్తున్నారు దర్శకులు. తాజాగా ఇద్దరు హీరోలైతే టాలీవుడ్‌పై సీరియస్‌గా ఫోకస్ చేసారు. మన తెలుగు ఆడియన్స్ మహా మంచోళ్లబ్బా.. ఒక్కసారి నచ్చారంటే చాలు నెత్తిన పెట్టుకుంటారు.. వాళ్లు మన ఇండస్ట్రీనా కాదా అని కూడా చూడరు. దుల్కర్ సల్మాన్‌కు ఇప్పుడిలాంటి ప్రేమే టాలీవుడ్‌లో దక్కింది. మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మన ఆడియన్స్‌కి బాగా చేరువైపోయారు దుల్కర్. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ మూడో తెలుగు సినిమాకు ముహూర్తం పెట్టారీయన.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్, శిఖర స్టూడియోస్ దుల్కర్ సల్మాన్ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 28న దుల్కర్ బర్త్ డే సందర్భంగా లక్కీ భాస్కర్ టైటిల్ పోస్టర్ విడుదల చేసారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. మరోవైపు ధనుష్ సైతం సార్ తర్వాత టాలీవుడ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ఈయన తాజాగా శేఖర్ కమ్ముల సినిమా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

సార్ బ్లాక్‌బస్టర్ కావడం.. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు తెలుగులో బాగానే ఆడటంతో ఇక్కడి దర్శకులపై ఫోకస్ చేస్తున్నారు ధనుష్. శేఖర్ కమ్ములతో ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కింది. అలాగే కెప్టెన్ మిల్లర్ ప్రమోషన్స్ కూడా తెలుగులో బాగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఓ వైపు దుల్కర్ సల్మాన్.. మరోవైపు ధనుష్ తెలుగు ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..