Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice Dhiraj Singh Thakur: నేడు ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఈ రోజు (శుక్రవారం) విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌తో..

Justice Dhiraj Singh Thakur: నేడు ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌
Justice Dhiraj Singh Thakur
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 28, 2023 | 9:01 AM

అమరావతి, జులై 28: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఈ రోజు (శుక్రవారం) విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌తో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం జగన్‌, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తేనీటి విందు అనంతరం జస్టిస్‌ ఠాకూర్‌ హైకోర్టుకు చేరుకుంటారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా కేసుల విచారణ చేపడతారు.

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తీర్థసింగ్‌ ఠాకూర్‌ సోదరుడే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ కుటుంబంలో అందరూ న్యాయమూర్తులే. ఆయన తండ్రి, సోదరుడు న్యాయమూర్తులుగా పనిచేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.