- Telugu News Photo Gallery Cinema photos Happy Birthday Dhanush: Interesting And Unknown Facts about hero Dhanush
Dhanush: ‘ఇతనేం హీరో..? ఇలా ఉన్నాడేంటి..’ అంటూ నాడు విమర్శలు! నేడు హాలీవుడ్‌లోనూ సత్తా
ఇతనేం హీరో..? ఇలా ఉన్నాడేంటి.. నటనేం బాగొలేదు! అంటూ ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (40) నేడు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. లుక్ చూసి విమర్శించిన వారే నేడు తన నటనకు జేజేలు కొడుతున్నారు..
Updated on: Jul 28, 2023 | 11:09 AM

ఇతనేం హీరో..? ఇలా ఉన్నాడేంటి.. నటనేం బాగొలేదు! అంటూ ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (40) నేడు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. లుక్ చూసి విమర్శించిన వారే నేడు జేజేలు కొడుతున్నారు. ఈ రోజు (జులై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ధనుష్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

తమిళనాట హీరో ధనుష్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్‌కి మాత్రం నటనంటే అస్సలు ఇష్టం లేదట. తండ్రి కస్తూరి రాజా బలవంతం మీద నటుడయ్యాడట.

నిజానికి చెఫ్ కావాలనేది ధనుష్ లక్ష్యం. ఐతే తండ్రి కస్తూరి రాజా మాట కాదనలేక నటుడయ్యాడు. అలా ‘తుల్లువదో ఇలమై’ సినిమాతో తెరంగెట్రం చేశాడు. 2002 మేలో విడుదలైన ఈ మువీ హిట్‌టాక్ అందుకున్నా హీరో ధనుష్ నటనకు డిస్‌కనెక్ట్ అయ్యారు. హీరో అస్సలేం బాగోలేడు అంటూ విమర్శలు గుప్పించారు.

దీన్ని సాకుగా చూసి నటనకు గుడ్‌బై చెప్పాలనుకోలేదు ధనుష్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే తపనతో ముందుకే అడుగులేశాడు. అలా మొదటి సినిమాలో చేసిన తప్పులను సరిదిద్దుకుని అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ‘కాదల్ కొండెయిన్’ కోలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అంతే ఇక వెనుదిరిగి చూడలేదు. తెలుగులో ‘రఘువరన్ బీటెక్’ మువీతో తెలుగోళ్లకూ కనెక్టయ్యాడు.

లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా వైవిధ్య నటతో ఎప్పటికప్పుడు పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకుంటూ క్యారెక్టర్లలో ఒదిగిపోగలడు. ‘రాంజనా’, ‘షమితాబ్’, ‘అత్రంగీరే’ మువీలతో బాలీవుడ్‌లోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో నటిస్తున్నాడు. అటు హాలీవుడ్ కూడా ధనుష్ నటనను గుర్తించింది. అలా ధనుష్ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’, ‘ది గ్రే మ్యాన్’ అనే రెండు సినిమాలో నటించాడు. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ మువీ షూటింగ్‌లో ధనుష్ బిజీగా ఉన్నాడు.





























