- Telugu News Photo Gallery Cinema photos Dulquer Salmaan Birthday Special Know About His Film Career and Family Details telugu cinema news
Dulquer Salmaan: ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఇంట్లోకి రానివ్వను.. దుల్కర్ సల్మాన్‌కు మమ్ముట్టి స్ట్రాంగ్ వార్నింగ్..
దుల్కర్ సల్మాన్.. ఈ పేరు తెలియని సినీ ప్రియుడు ఉండరు. భాషతో సంబంధం లేకుండా దక్షిణాది సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి తనయుడిగా హీరోగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్.. సెకండ్ షో సినిమాతో హీరోగా అలరించారు.
Updated on: Jul 28, 2023 | 11:43 AM

దుల్కర్ సల్మాన్.. ఈ పేరు తెలియని సినీ ప్రియుడు ఉండరు. భాషతో సంబంధం లేకుండా దక్షిణాది సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి తనయుడిగా హీరోగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్.. సెకండ్ షో సినిమాతో హీరోగా అలరించారు.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన.. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన నటన ఆకట్టుకుంది.

ఇటీవలే సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయనకు.. తెలుగులో ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఈరోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు.

ప్రస్తుతం ఆయన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్, కింగ్ ఆఫ్ కోత వంటి భారీ బడ్జెట్ గ్యాంగ్ స్టర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

తన తండ్రి తనతో చాలా సరాదాగా ఉంటారని.. ఇప్పటికీ ఆయన ఏడాదికి ఐదు సినిమాలు చేస్తున్నారని అన్నారు దుల్కర్ సల్మాన్.

కానీ నేను సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నానని.. ఇలా ఏడాదికి ఒకే సినిమా చేస్తే ఇంటికి రానివ్వను అని తన తండ్రి అన్నట్లు నవ్వుతూ చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ తను హీరో అన్న విషయాన్ని తన భార్య అంగీకరించదని.. ఆమె దృష్టిలో పనికి వెళ్లి ఇంటికి వచ్చే వ్యక్తిని మాత్రమే అని.. ఆమెకు ప్రతిసారి తాను నటుడిని అన్న విషయం గుర్తుచేయాలని అన్నారు.

ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఇంట్లోకి రానివ్వను.. దుల్కర్ సల్మా్న్కు మమ్ముట్టి స్ట్రాంగ్ వార్నింగ్..




