Hridayam Remake: ‘హృదయం’పై మనసుపారేసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌.. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో..

Hridayam Remake: ఈ ఏడాది మలయాళంలో విడుదలైన 'హృదయం' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్‌లాల్‌ (Mohanla) తనయుడు ప్రణవ్‌, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుందీ సినిమా...

Hridayam Remake: 'హృదయం'పై మనసుపారేసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌.. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో..
Hridayam Remake
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 26, 2022 | 8:57 AM

Hridayam Remake: ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘హృదయం’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్‌లాల్‌ (Mohanla) తనయుడు ప్రణవ్‌, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుందీ సినిమా. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఒక్క మయాళ ప్రేక్షకులనే కాకుండా భాషకు అతీతంగా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుంది. ఒక కుర్రాడి జీవితంలో వివిధ దశల్లో జరిగే ప్రయాణాన్ని ఈ సినిమాలో అద్బుతంగా చూపించారు. హీరో, హీరోయిన్ల అద్భుత నటన సంగీతం యువతను విశేషంగా ఆకట్టుకుంది.

మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హృదయం సినిమా తెలుగు రీమేక్‌పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్‌ స్టార్ నిర్మాత.. కరణ్‌ జోహార్‌ ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. హిందీతోపాటు, తమిళం, తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నారు.

ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని కరణ్‌ అధికారికంగా ప్రకటించారు. మలయాళంలో అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే హృదయం చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Also Read: Health Tips: ‘జీలకర్ర’ను ఈ సమయంలో తింటే సంపూర్ణ ఆరోగ్యం మీసోంతం.. పూర్తి వివరాలు మీకోసం..

కొవిడ్‌ బాధితులను వెంటాడుతున్న ఆ 2 సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త..!

IPL 2022: రాజస్థాన్ తుఫాన్ బ్యాట్స్‌మెన్.. 37 బంతుల్లో 70 పరుగులు.. ప్రత్యర్థులకు చుక్కలే..!