కొవిడ్‌ బాధితులను వెంటాడుతున్న ఆ 2 సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త..!

Long Covid: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ఇప్పటికి వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఎప్పుడు విజృంభిస్తుందో తెలియని పరిస్థితులు

కొవిడ్‌ బాధితులను వెంటాడుతున్న ఆ 2 సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త..!
Long Covid
Follow us
uppula Raju

|

Updated on: Mar 26, 2022 | 5:55 AM

Long Covid: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ఇప్పటికి వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఎప్పుడు విజృంభిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చైనా లాంటి కొన్ని దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్‌ విస్తృతిపై అలసత్వం వహించకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. అయితే కొవిడ్‌ బాధితులు వెంటనే కోలుకుంటున్నప్పటికీ లక్షణాలు మాత్రం వీడటం లేదు. చాలాకాలం పాటు అలాగే కొనసాగుతున్నాయి. ఇలాంటి లక్షణాలను ‘లాంగ్‌ కొవిడ్‌’ లక్షణాలుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా కొవిడ్‌ బాధితులని రెండు సమస్యలు వెంటాడి వేధిస్తున్నాయి. అందులో ఒకటి జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం. దాదాపు 70 శాతం మంది కొవిడ్‌ బాధితులు ఈ సమస్యలని ఎదుర్కొంటున్నారు. రిపోర్ట్‌ నెగటివ్‌ వచ్చినా ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతున్నాయి. వాస్తవానికి లాంగ్‌ కొవిడ్‌ ప్రభావాలను తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు.

ఇందులో భాగంగా లాంగ్‌ కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా మెమొరీ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం ఉన్నట్లు గుర్తించారు. ప్రతి పది మంది బాధితుల్లో ఏడుగురు ఇటువంటి న్యూరలాజికల్‌ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఈ లక్షణాలు శాశ్వతంగా లేదా ఏడాది వరకూ ఉంటున్నట్లు కేంబ్రిడ్జ్‌ నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, దగ్గు, నిద్రలేమి, ఆత్రుత, ఒళ్లు జలదరించటం వంటి సమస్యలు దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలుగా చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బలహీనత, జలుబు, దగ్గు ఉంటే అది ‘లాంగ్‌ కొవిడ్‌’ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అనారోగ్యంగా ఉండటం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె, మూత్రపిండాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. వాసన లేకపోవడం, ఆకలిగా అనిపించకపోయినా మీరు వైద్యుడిని సందర్శించాలి. అతిసారం, జీర్ణక్రియ సమస్య కూడా కరోనా వల్ల ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి. వెంటనే వైద్యుడిని సంప్రదించి మరికొంత కాలం ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించాలి.

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత