IPL 2022: రాజస్థాన్ తుఫాన్ బ్యాట్స్‌మెన్.. 37 బంతుల్లో 70 పరుగులు.. ప్రత్యర్థులకు చుక్కలే..!

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ (IPL 2022) ప్రారంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. శనివారం (మార్చి 26) చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య

IPL 2022: రాజస్థాన్ తుఫాన్ బ్యాట్స్‌మెన్.. 37 బంతుల్లో 70 పరుగులు.. ప్రత్యర్థులకు చుక్కలే..!
Shimran Hetmeyer
Follow us
uppula Raju

|

Updated on: Mar 26, 2022 | 5:46 AM

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ (IPL 2022) ప్రారంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. శనివారం (మార్చి 26) చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఇరు జట్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక మిగిలిన జట్లు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు ఒకటి, రెండు రోజుల సమయం పడుతుంది. ఈ పరిస్థితిలో జట్లు ఆటగాళ్ల బలబలాలను అంచనా వేసేందుకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతున్నారు. సరైన ప్లేయింగ్ XI కలయిక కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో కొత్త రిక్రూట్‌లు షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్ దుమ్ము ధులిపేశారు. 2008లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడం ద్వారా టైటిల్ రేసులో బలమైన ప్రత్యర్థిగా నిలవాలని భావిస్తోంది. జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇందుకు ఉదాహరణగా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో జట్టులోని కొత్త ఆటగాళ్లు తమ సత్తా చాటుతూ కెప్టెన్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఆశలు రేకెత్తించారు.

రాయల్స్ వారి సోషల్ మీడియా ఖాతాలలో స్కోర్‌కార్డ్‌ను పోస్ట్ చేసారు. దీని ప్రకారం జట్టును టీమ్ పింక్, టీమ్ బ్లూగా విభజించారు. ఇందులో బ్లూ జట్టుపై పింక్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. పింక్ తరఫున యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రాజస్థాన్‌కు వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 51 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతడితో పాటు జట్టులోకి తిరిగి వచ్చిన యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ కూడా 27 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మరోవైపు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్‌మెయర్‌ను రూ. 8.50 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం సరైనదేనని తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఈ మాజీ బ్యాట్స్‌మెన్ టీమ్ బ్లూ కోసం కేవలం 37 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు. ప్లేయింగ్ XIలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులకు హెచ్చరికలు కూడా జారీచేశాడు.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!