AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: ఎవడ్రా నిప్పుల కొండను ఆపేది? బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే

అన్నీ అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం' రిలీజ్ కాబోతుంది. శుక్రవారం (డిసెంబర్ 12)న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే అంతకన్నా ముందే రిలీజ్ టీజర్ రూపంలో నందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు అఖండ 2 మేకర్స్

Akhanda 2: ఎవడ్రా నిప్పుల కొండను ఆపేది? బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
Akhanda 2 Release Teaser
Basha Shek
|

Updated on: Dec 10, 2025 | 9:41 PM

Share

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రేపు ప్రీమియర్లు వుంటాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ టీజర్ విడుదలైంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ మరియు భక్తితో నిండిన యాక్షన్ దృశ్యం అఖండ 2: ది తాండవం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది, రేపు ప్రీమియర్లు ప్లాన్ చేయబడ్డాయి. 14 రీల్స్ ప్లస్ కింద రామ్ ఆచంట మరియు గోపి ఆచంట నిర్మించారు మరియు ఎం తేజస్విని నందమూరి సమర్పణలో, ఈ చిత్రం యొక్క గ్రాండ్ రిలీజ్ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.

టీజర్ ప్రేక్షకులను నేరుగా అఖండ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, బాలకృష్ణ అఖండ అవతార్ లో అదరగొట్టారు. భక్తి శక్తిగా మారి ఉగ్రరూపం దాల్చే అఖండ కథకు పర్ఫెక్ట్ టోన్ సెట్ చేస్తుంది. ఆది పినిశెట్టి చేసిన తాంత్రిక క్రతువులు, కుంభమేళా వాతావరణపు గ్లింప్స్ టీజర్‌కు మరో స్థాయి మిస్టిసిజం, గ్రాండియర్ ని యాడ్ చేశాయి. అఖండ యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వుంది. ప్రతి సన్నివేశం ధర్మ సంరక్షకుడిగా అతని పాత్ర గూస్ బంప్స్ తెప్పించింది. అద్భుతమైన శివ తాండవం మెస్మరైజ్ చేసింది.

బోయపాటి శ్రీను టీజర్‌ను విజువల్ గ్రాండియర్ తో ఆధ్యాత్మికంగా అద్భుతంగా రూపొందించారు. ఎస్ థమన్ అద్భుతమైన సంగీతం, 14 రీల్స్ ప్లస్ హై-ఎండ్ నిర్మాణ విలువలతో టాప్ క్యాలిటీలో వున్నాయి. మొత్తంమీద, టీజర్ పూర్తిగా గూస్‌బంప్‌లను అందిస్తుంది. BookMyShowలో ఈ చిత్రం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఆల్ టైమ్ హై స్థాయిలో సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ వేగంగా పెరుగుతుండటం, టికెటింగ్ పోర్టల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నందున అఖండ 2 మ్యాసీవ్ ఓపెనింగ్‌ దిశగా వెళుతోంది.

ఇవి కూడా చదవండి

బాలయ్య అఖండ 2 రిలీజ్ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.