టీటీడీలో కొత్త స్కామ్‌లు బయటపడుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బలమైన టీటీడీ బోర్డు, కూటమి ప్రభుత్వం ఉండటం, ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వల్లే ఈ స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మాటలకే పరిమితమైన అవకతవకలు ఇప్పుడు నిజమని తేలుతున్నాయని తెలిపారు.