ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ భారత్‌లో ప్రారంభం కానుంది. గ్రామాలు, కొండ ప్రాంతాలకు ఇంటర్నెట్ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నెలకు సుమారు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ధర ఉండవచ్చని అంచనా. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, కోల్‌కతాలో గేట్‌వే స్టేషన్ పనులు మొదలయ్యాయి.