AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా అందం అంటే..! గ్లామర్‌లో తల్లినే మించిపోయింది.. కాజోల్ కూతురు కేకపెట్టించింది

బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ కాజోల్! ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’తో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న ఈ భామ ఒకప్పుడు షారుఖ్​కి బెస్ట్​ జోడిగా చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఈ అందాల భామకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇది కదా అందం అంటే..! గ్లామర్‌లో తల్లినే మించిపోయింది.. కాజోల్ కూతురు కేకపెట్టించింది
Kajol
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2025 | 1:15 PM

Share

సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతుంది ఆమె బాలీవుడ్ అందల భామ కాజోల్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది కాజోల్. ఇదిలా ఉంటే..

మొన్నామధ్య కాజోల్ తన కూతురి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాజోల్ కూతురి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. నైసా అచ్చం తన తల్లిలాగే ఉందని.. గ్లామర్‌లో తల్లినే మించిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నైసార్ , కాజోల్ ఇద్దరు అక్కాచెల్లెల్లుగా కనిపిస్తున్నారని.. వాళ్లిద్దరూ ఒకేలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నైసార్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె సోషల్ మీడియాలో ఫోటోస్ చూస్తుంటే త్వరలోనే సినీరంగంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కొన్నాళ్ల క్రితం కాజోల్ తన కూతురు సినీరంగ ప్రవేశం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కూతురికి ఆసక్తి ఉంటే ఇండస్ట్రీలోకి వస్తుందని తెలిపింది. కానీ తన కూతురికి సినీ ప్రవేశం గురించి ఎలాంటి సలహాలు ఇవ్వలేదని తెలిపింది. ఇక కాజోల్, అజయ్ దేవగన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోహీరోయిన్స్. వీరిద్దరు కలిసి గతంలో అనేక చిత్రాల్లో నటించారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన వీఐపీ చిత్రంలో కాజోల్ విలన్ పాత్రలో అదరగొట్టింది. అలాగే ఇప్పుడు హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది కాజల్ అగర్వాల్.

View this post on Instagram

A post shared by Nysa Devgan (@nysadevganx)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో