కన్నీళ్లు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. నిన్ను కౌగిలించుకుని ఏడ్వాలని ఉందంటూ..
ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోగా రికార్డ్స్ సృష్టించాడు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సినీ పరిశ్రమలో సంచలనంగా మారాడు. ఉదయ్ కిరణ్‌ను అభిమానించేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు హీరో ఉదయ్ కిరణ్. ఆయన పేరు చెప్తే ప్రేక్షకులకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే స్టార్ గా ఎదిగారు. వరుస విజయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. లవ్ స్టోరీలకు ఉదయ్ పెట్టింది పేరు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్.. వరుసగా నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. దాంతో ఉదయ్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోయింది.
అయితే ఆ తర్వాత ఉదయ్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం.. అలాగే ఆయనకు అవకాశాలు తగ్గడంతో మనస్థాపానికి గురయ్యారు ఉదయ్. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అభిమానులు ఆయనఫోటోలను , పాటలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ చివరి లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ లేఖలో ఏముందంటే.. ” విషితా (ఉదయ్ కిరణ్ భార్య).. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. నువ్వు అంటే ఇష్టం. నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వాళ్లు బాధపడకూడదు. నువ్వు తాను మంచి వాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ పిచ్చివాడ్ని చేసి ఆడుకున్నారు. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..’ అని ఆ లెటర్ లో ఉంది. ఈ లెటర్ నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ లెటర్. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చదివిన నెటిజన్స్ ఉదయ్ కిరణ్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







