ఒకప్పుడు కురాళ్లను కట్టిపడేసిన కమలినీ ముఖర్జీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? అందుకే సినిమాలకు దూరం అయ్యిందట
ఒకప్పుడు తన అందంతో ఆకట్టుకున్న అందాల భామల్లో కమిలినీ ముఖర్జీ ఒకరు. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాల నుంచి దూరం అయ్యింది. ఈ అమ్మడు నటించిన మూవీ ప్రేక్షకులకు ఇప్పటికీ బోర్ కొట్టావు

తెలుగు సినిమాల్లో తమ అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. కొన్ని సినిమాలతోనే మెప్పించి ఆతర్వాత సినిమాలకు దూరం అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కప్పుడు రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. తక్కువ సినిమాలతోనే అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసిన తారలలో కమలినీ ముఖర్జీ ఒకరు. ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే జనాల హృదయాలు దొచుకుంది. ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఆ వెంటనే గోదావరి సినిమాతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. స్టైల్, గమ్యం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. దాదాపు పదేళ్లుగా మరో సినిమా చేయలేదు. అటు సోషల్ మీడియాలోనూ అంతగా కనిపించడం లేదు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. అందుకు గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించినంత స్థాయిలో తెరకెక్కలేదని.. దీంతో ఆ క్యారెక్టర్ పై అసంతృప్తి కలిగిందని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో ఫీలయ్యాయనని.. అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదని చెప్పుకొచ్చారు.
ఇక హీరోల గురించి మాట్లాడుతూ.. నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నారని.. సహ నటులతో ఎంతో సరదాగా ఉంటారని అన్నారు. ఇక శర్వానంద్ సహజంగా నటిస్తారని.. అంకిత భావంతో పనిచేస్తారని అన్నారు. స్టార్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పుకొచ్చారు. 2014లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కమిలినీ ముఖర్జీ తెలుగులో మరో సినిమా చేయలేదు. తమిళంలో మాత్రం ఇరైవి అనే సినిమాలో కనిపించింది. అలాగే మలయాళంలో పులిమురుగన్ సినిమాలో నటించింది. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




