Ram Charan: రామ్ చరణ్‌ను కలిసిన జపాన్ ఫ్యాన్స్.. గిఫ్ట్‌గా ఏమించారంటే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన సినిమాతో ఒక్కరిగా టాలీవుడ్ ను షేక్ చేశాడు బుచ్చిబాబు సన. ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బుచ్చిబాబు.. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో రానున్నాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ తో ఈ సినిమా కథను రెడీ చేశాడు. ఈ సినిమా లో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా చరణ్ ను జపాన్ నుంచి వచ్చిన ఓ అభిమానులు కలిశారు. స్టిల్స్ ను గ్రీటింగ్ కార్డ్స్ గా కట్ చేస్తూ చరణ్ కు చూపించారు. చరణ్ వాళ్ళ ప్రేమకు ఆశ్చర్యపోయారు. అలాగే క్రికెట్ బ్యాట్స్ పైన సిగ్నేచర్ చేసి రామ్ చరణ్ వాళ్ళకు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




