తెలంగాణలో చలి తీవ్రత అకస్మాత్తుగా పెరిగి ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. కుమరం భీమ్ అసిఫాబాద్ లోని గిన్నెధరిలో 6.1°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు, నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.