AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green India challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన బాలీవుడ్ స్టార్ హీరో..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి రంగాల‌తో...

Green India challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన బాలీవుడ్ స్టార్ హీరో..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 07, 2021 | 7:04 PM

Share

Green India challenge : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి రంగాల‌తో సంబంధం లేకుండా అంద‌రూ మొక్క‌లు నాటుతు‌న్నారు. టాలీవుడ్ నటులు మాత్రమే కాదు బాలీవుడ్ తారలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో చౌటుప్పల్ మండలం మల్కాపురం లోని హరిత పారిశ్రామిక పార్క్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  బాలీవుడ్ హీరో అజయ్ దేవ‌గ‌ణ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర‌తి ఒక్క‌రు కూడా మొక్క‌లు నాటి పర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని ఆయ‌న అన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం అజయ్ హైదరాబాద్ లో ఉంటున్నారు.  అజయ్ దేవగణ్ తో పాటు రాజ్య సభ సభ్యుడు సంతోష్ కుమార్, టి ఎస్ ఐఐ సి ఛైర్మెన్ రాజమల్లు తదితరులు కూడా మొక్కలు నాటారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Director Maruthi : మారుతి నెక్స్ట్ సినిమా ఆ యాక్షన్ హీరోతోనే.. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్

Pawan Harish Film: పవన్-హరీష్ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్.. ఇంతకుముందెప్పుడూ చేయని పాత్రలో

Follow Us