AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: భారీ ఎత్తున ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్..50 అడుగుల ప్రభాస్ కట్‌ఔట్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురూష్ విడుదల దగ్గరికి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా ఈ మైథలాజికల్ డ్రామాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను నిర్మించారు.

Adipurush: భారీ ఎత్తున ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్..50 అడుగుల ప్రభాస్ కట్‌ఔట్..
Aravind B
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 06, 2023 | 6:22 PM

Share

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురూష్ విడుదల దగ్గరికి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా ఈ మైథలాజికల్ డ్రామాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను నిర్మించారు. రాముని పాత్రలో ప్రభాస్ రాఘవుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ జానకిగా కీలక పాత్రలు పోషించారు. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృంద తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటి మైదానంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇదివరకెన్నడూ జరగని రీతిలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. సినిమా చరిత్రలో మొదటిసారిగా 50 అడుగుల ప్రభాస్ హోలోగ్రామ్‌ను ప్రదర్శించనున్నారు. అంతేకాదు ఈ వేడుకలో అయోధ్యను తలపించేలా సెట్ ఏర్పాటు చేస్తున్నారు.

No description available.

ఇవి కూడా చదవండి

హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి రెండు శ్రీమహవిష్ణువు అవతారాలే. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అయోధ్య, తిరుపతిల మధ్య ఆధ్మాత్మిక ఉట్టిపడేలా సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో100 డ్యాన్సర్లు, 100మంది గాయకులు ఆదిపురుష్‌తో పాటు, రామాయణానికి సంబంధించిన గీతాలను ఆలపించనున్నారు. లక్షమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నజియార్ స్వామి రానున్నారు.

ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత ద్వయం అతుల్‌-అజయ్‌లు స్వరాలు సమకూర్చారు. వీరిలో అతుల్‌ ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పైన వచ్చారు. శనివారం ముంబయిలో బయలుదేరి సోమవారం తిరుపతి చేరుకున్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్న ఆయన.. స్వామి వారి పాదాల వద్ద జైశ్రీరామ్‌ పాటను సమర్పించారు.

adipurush pre release event

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..