అందుకే జ్యూవెలరీ షాపు పక్కనే ఉన్న గదిలోకి అద్దెకి..! చివరికి ఏం జరిగిందంటే..

బంగారు నగల దుకాణంలో చోరీకి ఇద్దరు దొంగలు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఓ నగల దుకాణం పక్కనే గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అదను చూసి షాపు, గదికి మధ్య ఉన్న..

అందుకే జ్యూవెలరీ షాపు పక్కనే ఉన్న గదిలోకి అద్దెకి..! చివరికి ఏం జరిగిందంటే..
Jewelery Shop In Bhadradri Kothagudem
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2023 | 9:42 PM

బంగారు నగల దుకాణంలో చోరీకి ఇద్దరు దొంగలు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఓ నగల దుకాణం పక్కనే గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అదను చూసి షాపు, గదికి మధ్య ఉన్న గోడకు కన్నం వేసి గప్‌చుప్‌గా పనికానిచ్చాడు. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లోని రవి కాంప్లెక్స్‌లో అలువాల శంకర్‌ తొమ్మిదేళ్లుగా జువెల్లరీ షాప్‌ నిర్వహిస్తున్నాడు. నిత్యం కస్టమర్లతో శంకర్‌ షాపు సందడిగా ఉండేది. ఐతే శంకర్‌ షాపు పక్కనే ఉన్న గదిలో మే 26న కాంప్లెక్స్‌ యజమాని ఇద్దరు యువకులకు అద్దెకు ఇచ్చాడు. ఈక్రమంలో గత నెల 31న శంకర్‌ పని నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దుండగులు షాపుకు, గదికి మధ్య ఉన్న గోడకు కన్నం వేశారు. ఆ తర్వాత లోపలికి ప్రవేశించారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేశారు. ఆ తర్వాత షాపులోని దాదాపు రూ.87లక్షల విలువైన 42 కిలోల వెండి, 1242 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. శంకర్‌ ఆదివారం ఉదయం తిరిగివచ్చి చూడగా షాపు ఖాళీగా ఉండటం చూసి లబోదిబోమన్నాడు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాప్‌లో ఉన్న మరో సీసీ కెమెరా యాక్టివేట్గా ఉండటం గమనించి పుటేజీని పరిశీలించారు. పక్క గదిలో అద్దెకున్న యువకులే చోరీకి పాల్పడినట్లు తేలింది. జూన్‌ 1న రాత్రి 11 గంటలకు దుండగులు చోరీకి పాల్పడ్డాడని, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చుంచుపల్లి సీఐ రమాకాంత్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్నితెలంగాణ వార్తల కోసం చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!