Golconda APS Jobs 2023: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు జాబ్ మీదే..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Golconda Army Public School).. 18 పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ (టీచింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Golconda Army Public School).. 18 పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ (టీచింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకాలజీ, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్, మ్యూజిక్ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈడీ/ బీఈఐఈడీ/ డీఈడీ/ డీఈఐఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 16, 2023వ తేదీలోపు దరఖాస్తులు కింది అడ్రస్లో సమర్పించాలి. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్, సంగారెడ్డి, తెలంగాణ.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.