Shakeela: నేనింకా బతికే ఉన్నాను.. తన ఆరోగ్యంపై ఫేక్‌ వార్తను సృష్టించిన వారికి ధన్యవాదాలు తెలిపిన షకీలా. ఎందుకంటే..

Shakeela: కొన్ని వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ. తెగ వైరల్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి తలా తోక లేని వార్తలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే కొన్ని సమయాల్లో...

Shakeela: నేనింకా బతికే ఉన్నాను.. తన ఆరోగ్యంపై ఫేక్‌ వార్తను సృష్టించిన వారికి ధన్యవాదాలు తెలిపిన షకీలా. ఎందుకంటే..
Shakila Video
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 31, 2021 | 9:49 AM

Shakeela: కొన్ని వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ. తెగ వైరల్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి తలా తోక లేని వార్తలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే కొన్ని సమయాల్లో ఈ వార్తలు శృతి తప్పుతుంటాయి. బతుకున్న వ్యక్తులను సైతం చంపేస్తుంటాయి కొన్ని ఫేక్‌ వార్తలు. గతంలో నటుడు వేణు మాధవ్‌ బతికుండగానే చనిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా వేణు.. తాను బతికే ఉన్నానని చెప్పిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అయితే తాజాగా మరో నటి కూడా ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నారు. తానే ఒకప్పటి శృంగారా తార షకీలా.

షకీలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తాను ఇక లేరు అంటూ కొన్ని ఫేక్‌ వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ వార్తలకు ఎంతకీ చెక్‌ పడకపోవడంతో షకీలా ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను ఖండిస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో షకీలా మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చనిపోయానంటూ పుకార్లు వచ్చాయి. కానీ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఈ తప్పుడు వార్తలను ఎవ్వరూ నమ్మొద్దు. ఫేక్‌ వార్తలను చూసిన వారు చాలా మంది నాకు ఫోన్‌ చేసిన నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఙతలు. ఇక ఆ ఫేక్‌ వార్తలు సృష్టించిన వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. వారి వల్లే మీరంతా నావైపు చూశారు’ అంటూ పాజిటివ్‌గా స్పందించారు షకీలా.

షకీలా విడుదల చేసిన వీడియో..

Also Read: Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Sonu Sood : బన్నీ కోసం బరిలోకి దిగనున్న సోనూసూద్.. ‘పుష్ప’లో నటించనున్న జులాయి విలన్.?

K. Raghavendra Rao: దర్శక విశిష్టుడు.. ఇప్పుడు ‘వశిష్ట’గా మారారు.. ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయిన దర్శకేంద్రుడు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!