Virat Kohli: భర్తకు బర్త్‌డే విషెస్ చెప్పిన అనుష్క.. నవ్వులు పూయిస్తోన్న కోహ్లీ ఫొటోలు..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ స్టార్ ప్లేయర్. 15 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లి.. అంచలంచలుగా ఎదుగుతూ..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ స్టార్ ప్లేయర్. 15 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లి.. అంచలంచలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే అగ్ర స్థానానికి చేరుకున్నాడు. టీమిండియాకు ఎన్నో కీలక విజయాలను అందించి బెస్ట్ కెప్టెన్‌గా పేరు సంపాదించుకున్నాడు. నేడు (శనివారం) 34వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న కోహ్లీకి క్రీడాకారులతో పాటు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి బర్త్‌డే విషెస్‌తో హోరెత్తిస్తున్నారు. .
ఈ క్రమంలోనే విరాట్ సతీమణి అనుష్క శర్మ కూడా భర్తకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విరాట్‌కు విషెస్ చెబుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను షేర్ చేశారు. విరాట్ ఫన్నీగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసిన అనుష్క.. ‘మై లవ్ ఈరోజు నీ పుట్టిన రోజు. అందుకే నేను నీ బెస్ట్ ఫొటోలను పోస్ట్ చేశాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని రాసుకొచ్చింది అనుష్క పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలు ఇలా పోస్ట్ చేశారో లేదో అలా లక్షల సంఖ్యలో లైక్‌ల వర్షం కురుస్తోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ 2017లో డిసెంబర్ 11న మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అన్యోన్యతకు మారు పేరుగా ఉంటోన్న ఈ జంట ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తెగ సందడి చేస్తుంటారు. రెక్కలు కట్టుకొని విదేశాల్లో విహరిస్తుంటారు. వీరిద్దరు ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక ఈ కపుల్ కొన్ని రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..