AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Cime: డబ్బులు డ్రా చేయమంటే.. ఖాతా ఖాళీ చేసిన కేటుగాడు..

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసివ్వమంటే ఏకంగా ఖాతానే ఖాళీ చేశాడు ఒక కేటుగాడు. ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సినీ పక్కిలో ఆమెకు మోసం చేసి అక్కడ నుంచి జంప్ అయిపోయాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతుంది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుంపిణీపురం సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న సింగనమల రాజేశ్వరి నివాసం ఉంటోంది.

ATM Cime: డబ్బులు డ్రా చేయమంటే.. ఖాతా ఖాళీ చేసిన కేటుగాడు..
Atm Card Crime
Sudhir Chappidi
| Edited By: Srikar T|

Updated on: Mar 01, 2024 | 9:50 PM

Share

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసివ్వమంటే ఏకంగా ఖాతానే ఖాళీ చేశాడు ఒక కేటుగాడు. ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సినీ పక్కిలో ఆమెకు మోసం చేసి అక్కడ నుంచి జంప్ అయిపోయాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతుంది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుంపిణీపురం సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న సింగనమల రాజేశ్వరి నివాసం ఉంటోంది. డబ్బులు డ్రా చేసుకోవడం కోసం రాజంపేట ఎస్‎బీఐ మెయిన్ బ్రాంచ్‎కి ఆనుకుని ఉన్న ఏటీఎం వద్దకు వచ్చింది. తనకు డబ్బులు డ్రా చేసివ్వమని క్యూలో నిలబడి ఉన్న ఓ యువకుడిని అడిగింది. వెంటనే ఆ యువకుడు ఏటీఎం కార్డును మెషిన్‎లో పెట్టి పిన్ నెంబర్ చెప్పాల్సిందిగా కోరాడు. పిన్ నెంబర్ సరిగా లేదని డబ్బులు రావడం లేదని ఆ మహిళతో చెప్పి ఆ మహిళ ఏటీఎం కార్డు కాకుండా మరో ఏటీఎం కార్డును ఇచ్చాడు. ఇలా ఏటీఎం కార్డులు మార్చిన విషయం ఆ మహిళ గ్రహించలేకపోయింది.

ఇదే అదునుగా భావించిన కేటుగాడు రాజేశ్వరి ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఒకే రోజు 50 వేల రూపాయలను యూనియన్ బ్యాంక్ ఎటిఎం నుంచి విత్ డ్రా చేశాడు. తన అకౌంట్లో డబ్బులు మాయం అవడంపై రాజేశ్వరమ్మకు అనుమానం వచ్చి ఏటీఎం కార్డును పరిశీలించగా తాను మోసపోయిన విషయం తెలుసుకుంది. రాజేశ్వరి బంధువులు రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట పట్టణంలో ఏటీఎంల కేంద్రంగా గతంలోనూ ఎన్నో మోసాలు జరిగాయి. నిరక్షరాస్యులను, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాగే ఏటీఎంలు వద్ద కాపు కాసి నగదు డ్రా చేసి ఇవ్వమన్నవారికి కార్డు మార్చి ఇచ్చి మోసం చేసే ఓ వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఏటీఎం వద్దకు వచ్చే ప్రజలు జాగ్రత్తగా లేకపోతే తమ అకౌంట్లోలోని డబ్బులు కేటుగాళ్లు మాయం చేస్తారన్న విషయం గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి నేరాలపై పోలీసులు కూడా ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..