AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banshidhar Tobacco: అమ్మ బాబోయ్..! లగ్జరీ కార్లు.. బీరువా నిండా నోట్ల కట్టలు.. ఐటీ అధికారులే షాక్!

అది ఇల్లు కాదు.. లగ్జరీ కార్ల గ్యారేజ్‌. ఇంట్లో ఉన్నవి గదులు కాదు.. బ్యాంక్‌ లాకర్‌ రూమ్‌. అవును.. ఐటీ అధికారుల రైడ్స్‌లో మతిపోయే సీన్లు ఆ ఇంట్లో కనిపించాయి. బంషీధర్‌ టొబాకో కంపెనీ యజమాని ఇంట్లో సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ముంబైలలో జరిగిన ఐటీ దాడులు కంపెనీ టర్నోవర్‌లో ఆరోపించిన అసమానతలు బయటపడ్డాయి.

Banshidhar Tobacco: అమ్మ బాబోయ్..! లగ్జరీ కార్లు.. బీరువా నిండా నోట్ల కట్టలు.. ఐటీ అధికారులే షాక్!
Banshidhar Tobacco
Balaraju Goud
|

Updated on: Mar 02, 2024 | 8:00 AM

Share

అది ఇల్లు కాదు.. లగ్జరీ కార్ల గ్యారేజ్‌. ఇంట్లో ఉన్నవి గదులు కాదు.. బ్యాంక్‌ లాకర్‌ రూమ్‌. అవును.. ఐటీ అధికారుల రైడ్స్‌లో మతిపోయే సీన్లు ఆ ఇంట్లో కనిపించాయి. బంషీధర్‌ టొబాకో కంపెనీ యజమాని ఇంట్లో సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ముంబైలలో జరిగిన ఐటీ దాడులు కంపెనీ టర్నోవర్‌లో ఆరోపించిన అసమానతలు బయటపడ్డాయి.

బంషీధర్‌ గ్రూప్ అనే పొగాకు కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ కాన్పూర్ అధికారురలు దాడులు నిర్వహించారు. ఆ సంస్థకు సంబంధించిన పలు కీలక విషయాలను బయటపెట్టింది ఐటీ శాఖ. వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 20 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో నగదు, విలువైన పత్రాలు, ఇతర విలాసవంతమైన వస్తువులను కనుగొన్నారు.

ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని శివమ్ మిశ్రా ఇంటితో సహా ఐదు రాష్ట్రాలలో 15 నుండి 20 బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. మిశ్రా బంషీధర్ టొబాకో కంపెనీ వారసుడు. అతని ఇంట్లో అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్, ఫాంటమ్, లాంబోర్గిని, ఫెరారీ, మెర్సిడీస్‌, మెక్‌లారెన్ కార్లు ఉన్నాయి. వీటి విలువ రూ.60 కోట్లు ఉంటుందని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విలాసవంతమైన కార్లను సీజ్ చేశారు అధికారులు.

దేశంలోని అతిపెద్ద పొగాకు సరఫరా చేసే కంపెనీలలో ఒకటైన బంషీధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్, ప్రధాన పాన్ మసాలా గ్రూపులకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఇత‌ర సంస్ధల‌కు ముడిప‌దార్ధాల‌ను స‌ర‌ఫ‌రా చేసే పొగాకు కంపెనీ పెద్దమొత్తంలో ప‌న్నులు, జీఎస్టీ ఎగ‌వేత‌కు పాల్పడిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. కంపెనీ ట‌ర్నోవ‌ర్ రూ. 100 నుంచి రూ. 150 కోట్లు. కాగా, రికార్డుల్లో కేవ‌లం రూ. 20 నుంచి రూ. 25 కోట్లు చూపుతున్నార‌ని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో కీల‌క ప‌త్రాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

శివమ్ మిశ్రా ఇంటిపై జ‌రిపిన దాడుల్లో రూ. 4.5 కోట్ల న‌గ‌దును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పూర్‌లోని బ‌ంషీధ‌ర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్‌పై ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు రావ‌డంతో గురువారం రాత్రి నుంచి ఐటీ అధికారుల బృందం సోదాలు చేప‌డుతోంది. ఇక 15 నుంచి 20 ఐటీ బృందాలు గుజ‌రాత్‌, ఢిల్లీ స‌హా ఐదు ప్రాంతాల్లో కంపెనీకి చెందిన ప‌లు అడ్రస్‌లలో.. సోదాలు నిర్వహిస్తున్నాయి. ఫేక్‌ చెక్‌ని ఐటీ అధికారులకు ప్రూఫ్స్‌లో చూపించడంతో.. శివం మిశ్రా దొరికిపోయాడు. దీంతో అధికారులు.. రెయిడ్స్‌ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..