Andhra Pradesh: పక్కింటి పిల్లోడని పలకరిస్తే ఇంత దారుణమా..? ఆస్పత్రి పాలైన యువతి
తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని స్రవంతి అనే యువతిపై దాడికి పాల్పడ్డాడు మహేష్ అనే యువకుడు. చంద్రగిరి ఆర్ ఎఫ్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి ఇంటికెళ్ళి కత్తితో దాడి చేసిన మహేష్ సైకోలా ప్రవర్తించాడు. కత్తితో చేతులపై నరికడంతో స్రవంతి తీవ్ర గాయాలకు గురైంది. దీంతో స్థానికులు యువతిని తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని స్రవంతి అనే యువతిపై దాడికి పాల్పడ్డాడు మహేష్ అనే యువకుడు. చంద్రగిరి ఆర్ ఎఫ్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి ఇంటికెళ్ళి కత్తితో దాడి చేసిన మహేష్ సైకోలా ప్రవర్తించాడు. కత్తితో చేతులపై నరికడంతో యువతి తీవ్ర గాయాలకు గురైంది. దీంతో స్థానికులు యువతిని తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రగిరి కి చెందిన యువతి నర్సింగ్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. జులాయిగా తిరిగే మహేష్ ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఫ్యామిలీ ఉంటున్న ఇంటిపైనే యువతి కుటుంబం కూడా అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డ మహేష్ అంగీకరించని యువతిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే యువతిపై దాడికి కారణం అయ్యిందని పోలీసులు తెలిపారు. మహేష్ ప్రవర్తన నచ్చని యువతి కొంత కాలంగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే యువతిపై మహేష్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరుకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహేష్ కు దూరంగా ఉండటం జీర్ణించుకోని మహేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహేష్ పై గతంలో గంజాయి కేసు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యువతిపై కత్తికి దాడికి పాల్పడ్డ మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కత్తినిస్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చంద్రగిరి పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
