AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కిరాణ సరుకులు తీసుకుని.. డబ్బులు ఫోన్ పే చేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేస్తే షాక్..!

లావాదేవీల రూపంలో పళ్ళు, కూరగాయల దగ్గర నుండి పెద్ద పెద్ద మాల్స్, షోరూంలో చెల్లించే బిల్లులు కూడా డిజిటల్ చెల్లింపులు చెల్లించేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫోన్ పే పేరుతో కిరాణా కొట్టు యజమానికి టోకరా ఇచ్చాడు ఓ మోసగాడు. వేలాది రూపాయల కిరాణా సరుకులు కొని ఉడాయించాడు.

Andhra Pradesh: కిరాణ సరుకులు తీసుకుని.. డబ్బులు ఫోన్ పే చేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేస్తే షాక్..!
Digital Wallets
Nalluri Naresh
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 02, 2024 | 12:01 PM

Share

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటిని ఉపయోగించుకుని అమాయకులను నిండా ముంచేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. డిజిటల్ లావాదేవీల రూపంలో పళ్ళు, కూరగాయల దగ్గర నుండి పెద్ద పెద్ద మాల్స్, షోరూంలో చెల్లించే బిల్లులు కూడా డిజిటల్ చెల్లింపులు చెల్లించేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫోన్ పే పేరుతో కిరాణా కొట్టు యజమానికి టోకరా ఇచ్చాడు ఓ మోసగాడు. వేలాది రూపాయల కిరాణా సరుకులు కొని ఉడాయించాడు.

ఉరవకొండ పట్టణంలోని ఓ కిరాణ షాపులో తనకు భారీగా సిగరెట్ ప్యాకులు కావాలని, సరసమైన ధరకు ఇస్తే ఇక్కడే కొనుగోలు చేస్తానంటూ షాప్ యజమానిని నమ్మబలికాడు. ఉదయాన్నే భలే మంచి బేరం దొరికిందంటూ షాప్ యజమాని సదరు వ్యక్తి ఇచ్చిన కిరాణ సరుకుల లిస్టును మొత్తం నీట్‌గా ప్యాక్ చేశాడు. తర్వాత మొత్తం బిల్లు రూ. 24,500 అయిందంటూ అతడికి బిల్లును అందజేశారు. అబ్బా ఇంతేనా బాగా తక్కువ ధరకు ఇచ్చారంటూ ఫోన్ పే నెంబర్ చెప్పాలని మొత్తం బిల్లు ఫోన్ పే చేస్తానంటూ కటింగ్ ఇచ్చాడు.

షాపు యజమానికి తన ఫోన్ పే నెంబర్‌ను ఎంటర్ చేయాలని తన సెల్ ఫోన్ షాప్ యజమానికి ఇచ్చాడు. షాప్ యజమాని తన నంబర్ టైప్ చేసి తిరిగి అతనికి ఇచ్చాడు. ఆ నంబర్‌కు ఫోన్ ఫే చేస్తున్నట్టుగా నటించి తనకు కావలసిన వ్యక్తి నెంబర్‌ అక్కడ నమోదు చేసి షాప్ యజమానికి కాకుండా మరో వ్యక్తికి నగదు బదిలీ చేశాడు. అనంతరం సక్సెస్ ఫుల్ అంటూ మెసేజ్ రావడంతో ఆ మెసేజ్‌ను షాప్ యజమానికి చూపించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్టుగా నమ్మబలికాడు. వెంటనే తాను కొన్న సిగరెట్ బండిల్ తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు.

ఎంతసేపైనా తన అకౌంట్‌లో నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన షాప్ యజమాని తన అకౌంట్ పరిశీలించుకుని తాను మోసపోయినట్టు గుర్తించాడు. కిరాణ షాప్ యాజమానిని మోసగించిన తంతు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేటుగాడిని గుర్తించే పనిలో పడ్డారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…