Viral Photos: విశాఖ సాగర తీరంలో విచిత్ర జీవులు.. చూసేందుకు ఎగబడి వస్తున్న స్థానికులు..

ఇటీవల కాలంలో అనేక వింతలకు వేదికగా మారిన విశాఖ అర్ కే బీచ్‎లో మరో అద్భుతం చోటు చేసుకుంది. విశాఖ లోని R K బీచ్‌లో వైఎంసీఏకు ఎదురు తీరంలో ఇటీవల ఇసుక మీద మెరుస్తున్న ఒక ప్రత్యేకమైన జీవి కనిపించడం విశేషంగా మారింది. ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ECCT) నుండి శ్రీ చక్ర ప్రణవ్‌, వైల్డ్‌డ్ అనే ఎన్విరాన్‌మెంటల్ అవేర్‌నెస్ గ్రూప్‌కు చెందిన విమల్ రాజ్‎లు ఇటీవల ఒక సూర్యోదయాన విశాఖ బీచ్ తీరంలో వందలాది సముద్రపు డ్రాగన్‌లు, సముద్రపు బల్లులును కనుగొన్నారు.

Eswar Chennupalli

| Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 8:25 PM

1 / 7
వీటి సాంకేతిక నామం గ్లౌసిల్లా మార్జినాటా అంటారు. వీటితో పాటు బ్లూ బటన్ - పోర్పిటా పోర్పిటా,  బై-ది-విండ్ సెయిలర్ - వెలెల్లా వెలెల్లా తక్కువ ఆటుపోట్ల సమయంలో ఒడ్డుకు వచ్చినట్టు అనంతరం జరిపిన పరిశోధనల్లో వెలుగు చూసినట్టు ప్రణవ్, విమల్ రాజ్‎లు తెలిపారు. తక్కువ ఆటుపోట్ల సమయంలో జీవులు అప్పుడప్పుడు తూర్పు తీరం వెంబడి ఈ సముద్రపు డ్రాగన్ లు కనిపిస్తున్నప్పటికీ, ఈసారి గోచరించిన ఈ ప్లాంక్టోనిక్ జాతుల పరిమాణం చాలా చిన్నది.

2 / 7
గతంలో గోచరించిన పోర్పిటా సుమారు ఒకటిన్నర అంగుళం వ్యాసం ఉండేది. ఈసారి కనిపించిన ఈ సముద్రపు డ్రాకులా పరిమాణం ఒకటి నుండి రెండు మిల్లీమీటర్లు మాత్రమే. ఇది అసాధారణమైనది. ఆసక్తికరంగా, దానితో పాటు బీచ్‌లో ఉన్న ఇతర జాతులు కూడా పరిమాణంలో చాలా చిన్నవిగా ఉన్నాయి.  వీటిపై ప్రణవ్ మాట్లాడుతూ "ఇది మహాసముద్రాలలోనీ జీవశాస్త్రంలో ఏమి జరుగుతోందనే దాని గురించి పలు ప్రశ్నలను లేవనెత్తుతుందనీ, అదే సమయంలో ఏ ఒక్క జాతికి సంబంధించిన పూర్తిగా పెరిగిన ఒక్క నమూనా కూడా ఎందుకు కనిపించదన్న అనుమానాన్ని ప్రణవ్ వ్యక్తం చేశారు.

3 / 7
ప్లాంక్టోనిక్ జాతులకు ఈత కొట్టేందుకు అవసరమయ్యే అవయవాలు లేనప్పటికీ, అవి గాలుల ద్వారా కదులుతాయనీ, ఆ విధంగా మనుగడ సాగిస్తాయి. "ఈ పాలిప్స్ కాలనీలో టెన్టకిల్స్, స్టింగ్ సెల్స్ ఉంటాయి. నీలిరంగు బటన్లు గాలిలో నావికులు కుట్టడం మానవులకు ప్రమాదకరం కానప్పటికీ, అది కుట్టినట్లు కూడా తెలియదు. అయితే ఈ రెండిటితో పాటు సాధారణంగా మరొక జాతి కూడా కనిపిస్తుంది.

4 / 7
పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్. ఇది కుడితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇవి  చర్మంపై కుట్టడం తో చాలా నొప్పి కలుగుతుందని  ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరంలో సముద్ర జాతులను డాక్యుమెంట్ చేస్తున్న ప్రణవ్ టీవీ9 తో తెలిపారు. సముద్రపు డ్రాగన్‌లు లేదా సముద్రపు బల్లులు (గ్లౌసిల్లా మార్జినాటా) వాటితో పాటుగా కనిపించే నీలిరంగు బటన్, బై-ది-విండ్-సైలర్ పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్‌ పై వేటాడతాయి. ఈ అద్భుతమైన నీలిరంగు షేడెడ్ జీవులు వాటి ఆహారం వలె గాలితో తేలియాడుతూ కదులుతాయి.

5 / 7
ఇవి ఒక రకమైన అయోలిడ్ నుడి బ్రాంచ్ స్లగ్‌లు లేదా నత్తలు. కానీ ఇతర నత్తల మాదిరిగా కాకుండా, వాటి పాదం ఉపరితలాలకు అతుక్కొని కదలడానికి బదులు తేలడంలో సహాయపడుతుంది. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సముద్రపు డ్రాగన్‌లు పైన పేర్కొన్న రెండు జాతులైన బ్లూ బటన్, పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్‌లను తింటాయి

6 / 7
విశాఖపట్నం తీరంలోని సముద్ర జాతుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని చెబుతూ, ECCT వైల్డ్ సభ్యులు ఇసుక బీచ్‌లను వినోదం కోసం సందర్శకులు తరచుగా వస్తుంటారు కాబట్టి అటువంటి జాతుల ఉనికిని కాపాడి ప్రజలకు చూపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

7 / 7
Follow us