AP Crime News: రోడ్డు పక్కన మహిళ మృతదేహం.. కృష్ణా జిల్లాలో కలకలం..
Woman Murder: నేరాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ.. దుండగులు రెచ్చిపోతున్నారు. సమాజంలో రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడ ప్రాంతంలో
Woman Murder: నేరాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ.. దుండగులు రెచ్చిపోతున్నారు. సమాజంలో రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేగింది. సోమవారం కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు మండలంలోని పెద్దపులిపాకలో మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆమెను హత్య చేసి రోడ్డు పక్కన మృతదేహాన్ని వదిలివెళ్లారు. రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల సమాచారంతో మృతదేహం పెద్దపులిపాక గ్రామానికి చెందిన రజనీ (30)గా గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా రజిని కొంతకాలంగా పుట్టింటి వద్ద ఉంటోంది. అయితే.. రజినిపై యాసిడ్ తో దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రజినిని హత్య చేసింది ఎవరు.. ఎందుకు చేశారు.. అంతలా ఎవరితో శతృత్వం ఉంది.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: