Ramagundam: సింగరేణిలో ఘోర ప్రమాదం.. గని పైకప్పు కూలి నలుగురు దుర్మరణం..
Singareni Mine collapsed at Ramagundam: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం 3 ఏరియా పరిధిలోని ఆండ్రియాల లాంగ్వాల్ సింగరేణి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం సంభవించింది. కార్మికులు పనిచేస్తుండగా.. హఠాత్తుగా పైకప్పు కూలింది.
Singareni Mine collapsed at Ramagundam: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం 3 ఏరియా పరిధిలోని ఆండ్రియాల లాంగ్వాల్ సింగరేణి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం సంభవించింది. కార్మికులు పనిచేస్తుండగా.. హఠాత్తుగా పైకప్పు కూలింది. ఈ ఘటనలో మేనేజర్ సహా ముగ్గురు కార్మకులు దుర్మరణం చెందారు. వారి మృతదేహాలను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం నుండి ఒక కార్మికుడు సురక్షితంగా బయటపడ్డాడు.
సింగరేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను మేనేజర్ నరేశ్‌తో పాటు మరో ముగ్గురిని కార్మికులుగా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: