Russia Ukraine War: పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన వాహనదారులు.. భారత్‌ను తాకిన యుద్ధం సెగ..
ఉక్రెయిన్‌లో యుద్ధం(Russia Ukraine War) సెగ మనకూ తగులుతోంది. పెట్రోల్( Petrol), డీజిల్(Diesel) ధరలు భారీ పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్..
ఉక్రెయిన్‌లో యుద్ధం(Russia Ukraine War) సెగ మనకూ తగులుతోంది. పెట్రోల్( Petrol), డీజిల్(Diesel) ధరలు భారీ పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతుందన్న కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా దోపిడీ మొదలుపెట్టేశారు కొందరు పెట్రోల్ బంక్ యాజమానులు. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేదంటూ మాయ చేస్తున్నారు. స్టాక్ లేదని చెబుతూ పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కనిపించింది. పెట్రోల్ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టకుండానే స్టాక్ లేదని చెబుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు యజమానులు. దాంతో పెట్రోల్ బంక్‌ల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
14 ఏళ్లలో మొదటిసారి 140 డాలర్లకు చేరింది బ్యారెల్ క్రూడాయిల్ ధర. 2008 నుంచి ఇదే అత్యధిక రేటు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్ లీటరుకు దాదాపు 12 నుంచి 25 రూపాయల వరకు పెంచే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ఇవాల్టితో ముగుస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ రేట్స్ పెరిగే ఛాన్సుందని అంటున్నారు నిపుణులు. ఇదే జరిగితే సామాన్యుని జేబుకు చిల్లుపడటం ఖాయమంటున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా, యూరప్ దేశాలు పరిశీలిస్తున్నాయి. దీంతో క్రూడ్ ధర మరింత పెరుగుతోంది.
సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు రోజూ ధరలను సవరిస్తాయి. ఐతే మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. కానీ ఉక్రెయిన్ సంక్షోభంతో ధరలు అమాంతం ఆకాశానికంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైపైకి కదులుతున్నాయి. దీని ప్రభావంతో పెట్రోల్ ధరలు 150కి చేరే అవకాశముందంటున్నారు నిపుణులు.
ఇక బంగారం ధర 60వేల రూపాయలను టచ్ చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,800గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 60వేలకు పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి: Russia – Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో.. 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని మోడీ..!
Shane warne: స్పిన్ దిగ్గజం గదిలో రక్తపు మరకలు.. థాయ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..