Microsoft Hyderabad: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి.. మైక్రోసాఫ్ట్‌తో డీల్‌ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం

Microsoft Hyderabad Data Centre: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం భారీ డీల్‌ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. నగరంలో..

Microsoft Hyderabad: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి.. మైక్రోసాఫ్ట్‌తో డీల్‌ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2022 | 4:26 PM

Microsoft Hyderabad: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం భారీ డీల్‌ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. నగరంలో సుమారు రూ.15000 కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్‌ (Data Centre)ను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ప్రకటించింది. డేటా సెంటర్‌ ఈవెంట్‌లో ఈ ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుపై మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ (KTR) సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌ (Hyderabad)కు డేటా సెంటర్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందని మంత్రి ట్వీట్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు మైక్రోసాఫ్ట్ రూ.15వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం హర్షనీయమన్నారు. అయితే జనాభా పెరుగుతున్న కారణంగా టెక్నాలజీ పరంగా మరింతగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో తన నాలుగో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మైక్రో సాఫ్ట్ తెలిపింది. అయితే ఈ డేటా సెంటర్‌ గురించి గత ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్‌ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది.

దేశంలో డేటా అవసరాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, సెంటర్లను నెలకొల్పడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్‌ నగరం ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్ల వరకూ ఉండగా, ఇది 2023 నాటికి 96 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. అయితే తెలంగాణ ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత వంటి కారణాలతో డేటా కేంద్రాలు ఏర్పాటుకు కంపెనీలు హైదరాబాద్‌ వైపు మొగ్గుచూపుతున్నాయి. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌తోపాటు మరికొన్ని కంపెనీలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా డేటా సెంటర్‌తో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చిన C-17 విమానం ప్రత్యేకత ఏమిటి..?

కెమెరా.. ఫీచర్స్‌, ధర వివరాలు