Realme C35: రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మార్చి 7న విడుదల.. 50MP కెమెరా.. ఫీచర్స్‌, ధర వివరాలు

Realme C35: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక రియల్‌ మీ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదలైంది. రియల్‌మీ సీ35(Realme C35..

Realme C35: రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మార్చి 7న విడుదల.. 50MP కెమెరా.. ఫీచర్స్‌, ధర వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 06, 2022 | 10:42 AM

Realme C35: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక రియల్‌ మీ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదలైంది. రియల్‌మీ సీ35(Realme C35)స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)ను విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేసింది కంపెనీ. మార్చి 7న మధ్యాహ్నం 12.30 గంటలకు మొబైల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మొబైల్‌ 50MP ప్రధాన సెన్సార్‌తో కూడిన మూడు కెమెరాల సెటప్‌, మాక్రో సెన్సార్, ప్రొట్రయిట్‌గా మిగిలిన రెండు కెమెరాలు ఉంటాయి. ఫుల్ హెచ్‌డీ+డిస్‌ప్లే, ఆక్టోకోర్‌ ప్రాసెస్‌తో రానుంది. ఈ మొబైల్‌ గతంలో థాయ్‌లాండ్‌లో విడుదలైంది. అక్కడ ప్రారంభ ధర 5,799 థాయ్‌ బాట్స్‌ (సుమారు రూ.13,350)గా ఉంది. అయితే భారత్‌లో రూ.10వేల లోపు ఉండే అవకాశాలున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫోన్‌ 6.6 అంగుళాల సైజు, 600 నిట్స్‌ పిక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పొడిగించుకోవాలంటే సూపర్‌ పవర్‌ సేవింగ్‌ మోడ్‌ ఫీచర్‌ ఈ మొబైల్‌లో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. Realme C35లో అక్టాకోర్ యునిసోక్ టీ616 (Unisoc T616) ప్రాసెసర్‌ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా,18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉండనుంది. ఈ ఫోన్‌ గరిష్ఠంగా 128జీబీ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Oppo Reno 7Z 5G: ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్‌ లాంచ్‌.. 64 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు..

nfinity Train: బొగ్గు, డీజిల్‌ లేకుండానే పరుగులు పెట్టనున్న రైలు.. ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే..!