BrahMos Missile: లక్ష్యాన్ని చేధించిన బ్రహ్మోస్ క్షిపణి.. వాయుసేన ప్రయోగం విజయవంతం.. వీడియో
Indian Navy: భారత్ సైనికా సంపత్తి మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అగ్రదేశాలకు దీటుగా శక్తిమంతమైన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
Indian Navy: భారత్ సైనికా సంపత్తి మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అగ్రదేశాలకు దీటుగా శక్తిమంతమైన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. భారత నావికాదళం లాంగ్ రేంజ్ వెర్షన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ పిన్ పాయింట్‌లో టార్గెట్చేరుకున్నట్లు తెలిపింది నేవీ. బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష సక్సెస్ అయినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. లక్ష్యాన్ని పిన్ పాయింట్‌లో ధ్వంసం చేసిందని స్పష్టం చేసింది. బ్రహ్మోస్ అనేది సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి ( BrahMos cruise missile). అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం భారత్ (DRDO), రష్యా కలిసి ఈ జాయింట్ వెంచర్‌ను రూపొందించాయి. తమ ఫ్రంట్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల పోరాట సంసిద్ధతను ప్రదర్శించే అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు తెలిపింది భారత నావికాదళం. నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకోవడంలో క్షిపణి సూపర్ సక్సెస్ అయినట్లు స్పష్టం చేసింది. అత్యంత కచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లో మరో ఘనతను సాధించినట్లు పేర్కొన్నారు.
ఈ క్షిపణి నేలపై నుంచి, సముద్రంపై యుద్ధనౌక నుంచి, సముద్రం లోపల ఉండే జలాంతర్గాముల నుంచే కాకుండా ఆకాశంలో యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేలా రూపొందించారు. భారత DRDO, రష్యా సంయుక్తంగా నిర్వహించిన బ్రహ్మోస్ మిషన్ సక్సెస్ కావడంపై ఇరుదేశాలకు చెందిన సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విభాగాల్లో భద్రతపై రాజీపడకుండా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సైనిక పాఠవంలో ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తోంది. అందుకు ఉదాహరణే అత్యంత శక్తిమంతమైన బ్రహ్మోస్ క్షిపణి సక్సెస్ అని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Long range precision strike capability of Adv version of #BrahMos missile successfully validated. Pin point destruction of tgt demonstrated combat & mission readiness of frontline platforms. Yet another shot in the arm for #AatmaNirbharBharat#IndianNavy #CombatReady & #Credible pic.twitter.com/NKl3GoHwbB
— SpokespersonNavy (@indiannavy) March 5, 2022
Also Read: