Telangana Budget: మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్‌రావు.. రైతు, దళిత సంక్షేమానికి ప్రాధాన్యత
వచ్చేఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి సంక్షేమ బడ్జెట్‌తో ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు.
Telangana Budget 2022-23: వచ్చేఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి సంక్షేమ బడ్జెట్‌తో ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు(Harish Rao) శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ ఏకంగా 26వేల కోట్లు పెరిగింది. ఊహించినట్లుగానే కేటాయింపుల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయం(Agriculture), సాగునీటి శాఖ(Irrigation)లకు అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్న రైతుబంధు, దళిత బంధు స్కీమ్స్‌కు కేటాయింపులు పెంచారు. ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలుకు చెప్పుకోదగ్గ కేటాయింపు చేశారు…
తమది బడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్ కాదని…. బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్అని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌రావు. ఇది ముమ్మాటికి KCR మార్క్ బడ్జెట్ అని చెప్పారు.. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి హరీష్‌రావు. పురిటి దశలోనే తెలంగాణపై కేంద్రం దాడి మొదలైందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయలకు కేంద్రం గండి కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు నవ్విపోదురుగాక అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా పట్టించుకోకుండా…తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులకు కేంద్రం తొక్కిపెడుతోందని ఆరోపించారు హరీష్‌రావు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల 56 వేల 958 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. CM కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకానికి 17 వేల 700 వందల కోట్లు కేటాయించామనా హరీష్ రావు తెలిపారు.. వ్యవసాయం, ఇరిగేషన్‌శాఖలకు కూడా పెద్దపీట వేశామన్నారు. 2021-22 నాటికి జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. ఈ ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రంపై ప్రభుత్వం విరుచుకుపడింది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపిందని మండిపడ్డారు. అక్రమ బదలాయింపుతో తెలంగాణ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం చేసిందని అన్నారు. విభజన హామీలు అమలు చేయడం లేదని మంత్రి తెలిపారు. బిడ్డను బతికించారు అంటూ కేంద్ర పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఐటీఐఆర్‌పై అన్యాయం చేసిందని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధ్యుత్ సంస్కరణలు రైతుల పాలిట గొడ్డలి పెట్టని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని షరతు పెట్టింది. అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానేకాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. అంతా శుష్కప్రియాలు.. శూన్య హస్తాలే అన్నారు. పన్నుల రూపంలో 41 శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ దొడ్డి దారిన పన్నులు వసూలు చేస్తోంది. కేంద్రం ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తప్పుబట్టిందని మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చలేదని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.