పనిచేస్తుండగా ఊహించని ఉపద్రవం.. గని పై కప్పు కూలి ఘోరం.. 14 మృతదేహాలు వెలికితీత

చైనాలో బొగ్గు గని(Mine colalps in China) కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది కార్మికులు మృతి చెందారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్స్‌లో ఈ ఘటన...

పనిచేస్తుండగా ఊహించని ఉపద్రవం.. గని పై కప్పు కూలి ఘోరం.. 14 మృతదేహాలు వెలికితీత
Mine Collaps
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 07, 2022 | 1:44 PM

చైనాలో బొగ్గు గని(Mine colalps in China) కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది కార్మికులు మృతి చెందారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సాన్హే షంగ్జన్‌ బొగ్గు గని(Coal Mine)లో ఫిబ్రవరి 25న పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక(Rescue) సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారం రోజులు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నా ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా వారి మృతదేహాలు నిన్న బయటపడ్డాయి.

మరోవైపు చైనాలో బొగ్గు గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంతోమంది కార్మికులు ఈ గనుల్లో సజీవ సమాధి అయిపోతున్నారు. మరో ఘటనలో నైరుతి చైనాలో ఓ బొగ్గు గని కూలిపోయింది. గనిలో చిక్కుకుపోయినవారిని కాపాడటానికి సహాయకబృందాలు 10 రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. గని ప్రవేశ ద్వారం నుంచి దాదాపు 3 కిలోమీటర్లు పై కప్పు కూలిపోయింది. కూలిపోయిన పైకప్పు చాలా పెద్దదిగా ఉండటంతో గనిలో చిక్కుకున్నవారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు స్థానిక అధికారులు, పోలీసులు వెల్లడించారు.

Also Read

సచిన్ రికార్డ్‌ బ్రేక్ చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.. త్వరలో ఇండియాటీంలో చోటు సంపాదిస్తాడు..!

యాద్రాద్రిలో గవర్నర్ తమిళిసై.. అధికారుల ఘనస్వాగతం.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Fuel Prices: మళ్లీ పెట్రో బాంబ్‌.. బాదుడే బాదుడు.. సామాన్యుడిపై మోయలేని భారం..