యాద్రాద్రిలో గవర్నర్ తమిళిసై.. అధికారుల ఘనస్వాగతం.. ఆలయంలో ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్( Governor Tamilisai Soundara Rajan) దర్శించుకున్నారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆమె పోలీసుల....

యాద్రాద్రిలో గవర్నర్ తమిళిసై.. అధికారుల ఘనస్వాగతం.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Tamili Sai
Follow us

|

Updated on: Mar 07, 2022 | 12:09 PM

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్( Governor Tamilisai Soundara Rajan) దర్శించుకున్నారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. యాదాద్రి(Yadadri) ప్రధానాలయాన్ని సందర్శించారు. స్వయంభు మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నాలుగో రోజు వటపత్రసాయి అలంకార సేవ(Vatapatra sai seva)లో లక్ష్మీ నరసింహస్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. తెలంగాణ బడ్జెట్ ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు లక్ష్మీసమేత నారసింహుడు బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 11రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈనెల 14న ముగుస్తాయి. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభం కానున్నాయన్న సర్కార్ ప్రకటనతో గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. అయితే తన ప్రసంగం లేకపోయినప్పటికి బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read

NOS Scholarship 2022-23: ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారా? చివరితేదీ ఇదే..

Vizag Steel Plant Jobs: బీటెక్‌ గ్రాడ్యుయేట్లకు తీసికబురు! వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 206 అప్రెంటిస్‌ ఖాళీలు..3 రోజులే గడువు!

Russia-Ukraine War: ఉక్రెయిన్‌ కీవ్‌, చెర్నిహివ్‌లో మరోసారి సైరన్‌ మోత.. మిగిలిన భారతీయుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్ గంగా!