AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇటువంటి లక్షణాలున్న వ్యక్తులు.. కుటుంబ సభ్యులు కూడా శత్రువులు అవుతారానంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రం(Niti Shastra) ద్వారా నేటి ప్రజలకు..

Chanakya Niti: ఇటువంటి లక్షణాలున్న వ్యక్తులు.. కుటుంబ సభ్యులు కూడా శత్రువులు అవుతారానంటున్న చాణక్య
Surya Kala
|

Updated on: Mar 07, 2022 | 9:04 AM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రం(Niti Shastra) ద్వారా నేటి ప్రజలకు తెలియజేశాడు. చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో విజయం సాధించాలంటే  కష్టపడి పనిచేయాలి. లక్ష్యాలను సాధించడానికి,  సుఖసంతోషాలతో జీవితం గడపడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరైనా సరే చాణుక్యుడి చెప్పిన పాఠాలను అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగితే, అతను తన కష్ట కాలాన్ని కూడా సులభంగా అధిగమిస్తాడు. చాణుక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలను గుర్తు పెట్టుకోకుంటే.. కుటుంబ సభ్యులు కూడా శత్రువులు అవుతారు.

విధేయత, సంస్కారం, విద్యావంతులైన పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. అయితే అదే పిల్లవాడు మూర్ఖడు,  చెడు సహవాసంలో పడిపోతే లేదా వ్యసనానికి గురైనట్లయితే.. అటువంటి తల్లిదండ్రులకు తమ పిల్లలు శత్రువుల కంటే ఎక్కువ.

తండ్రి తన పిల్లల భవిష్యత్ కు భరోసా ఇస్తాడు. అతను తన పిల్లలను ప్రతి కష్టాల నుండి రక్షించి.. ప్రాపంచిక జ్ఞానం పొందడంలో సహాయం చేస్తాడు. అయితే ఒకొక్క సారి తండ్రి చాలా అప్పులు చేసి, తిరిగి చెల్లించలేనప్పుడు.. ఆ అప్పులను అతని కొడుకు ఆ అప్పుల భారాన్ని మోయవలసి వస్తుంది. అలాంటి పిల్లలు తన తండ్రిని శత్రువుగా భావిస్తారు.

తెలివైన, విద్యావంతురాలైన భార్యను పొందిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అయితే ఆ భార్య పరాయి వ్యక్తి వైపు ఆకర్షితురాలైతే.. అటువంటి పరిస్థితిలో ఆమె తన భర్తకు, పిల్లలకు, కుటుంబానికి అపవాదుకు కారణమవుతుంది. అటువంటి భార్య ఉన్న కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోతుంది.

తల్లి తన బిడ్డల ప్రేమ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఎప్పుడైతే తల్లి బిడ్డల మధ్య విభేదాలు ఏర్పడి.. ఒకొక్కసారి హాని కలిగిస్తుంది. అటువంటి సమయంలో తల్లి.. తన పిల్లలకు పెద్ద శత్రువు అవుతుంది.

భార్య కు ప్రేమ, గౌరవం ఇచ్చే మంచి భర్త లభిస్తే.. అటువంటి భార్య అదృష్టవంతురాలు. అయితే భర్త మత్తుకు అలవాటు అయినా మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నా.. అటువంటి భార్య.. భార్యకు శత్రువు కంటే తక్కువకాదు.

Also Read:

సుఖ సంపదలను ఇచ్చే మణిద్వీప వర్ణన.. ఈ విధంగా పారాయణం చేయండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం