Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి..

Horoscope Today: జీవితంపై రాశి ఫలాల ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ప్రతి రోజూ తమ దిన ఫలాలను (Horoscope) చూసుకుంటారు. అంతేనా ఈ ఫలితాల ఆధారంగానే రోజును ప్లాన్‌ చేసుకునే వారు కూడా చాలా మందే ఉంటారు. మరి ఈ రోజు (సోమవారం) మీ రాశి ఫలాలు...

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 07, 2022 | 7:07 AM

Horoscope Today: జీవితంపై రాశి ఫలాల ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ప్రతి రోజూ తమ దిన ఫలాలను (Horoscope) చూసుకుంటారు. అంతేనా ఈ ఫలితాల ఆధారంగానే రోజును ప్లాన్‌ చేసుకునే వారు కూడా చాలా మందే ఉంటారు. మరి ఈ రోజు (సోమవారం) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

మేష రాశి:

మేష రాశి వారికి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి సమాజంలో విశేష గౌరవం దక్కుతుంది. ఇస్తి వివాదాలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం:

ఈ రాశి వారికి సోమవారం మిత్రులు, బంధువులతో తగాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మిథునం:

మిథున రాశి వారికి ఈ రోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు చేపట్టే పనులు సాకారం కానున్నాయి. పలుకుబడిన కలిగిన వారు పరిచయమవతారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం.

కర్కాటకం:

ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శించే సూచనలు కనిపిస్తున్నాయి.

సింహం:

సింహ రాశి వారికి ఈ రోజు కాస్త ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవహారాలు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్థిక పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కన్య:

కన్య రాశి వారికి తీసుకున్న రుణం విషయంలో ఒత్తిడిలు కలిగే అవకాశం కనిపిస్తోంది. అనారోగ్యం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కొంత నిరాశ కలిగే అవకాశాలు ఉన్నాయి.

తుల:

తుల రాశి వారికి ఈ రోజు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చేసే పనుల్లో పురోభివృద్ధి సూచిస్తోంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లబ్ధి కలిగే సూచనలు ఉన్నాయి. సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తాయి. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు ఫలిస్తాయి. కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది.

ధనుస్సు:

ధనుస్సు రాశి వారికి బంధువులతో తగాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోని ప్రయాణాలు, వ్యయప్రయాసలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మకరం:

ఈ రాశి వారికి ఈరోజు చేసే పనుల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు, బంధువుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

కుంభం:

కుంభ రాశి వారికి ఈ రోజు పూర్తిగా అనుకూలంగా కనిపిస్తోంది. శ్రమకు తగ్గ ఫలితం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:

మీన రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేర్పుగా వ్యవహరించడం మంచిది. అనారోగ్యం, దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసే అవకాశాల ఉన్నాయి.

Also Read: Market News: ఈ వారం మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ ఉంటుందా.. ఈ 4 విషయాలు చాలా కీలకం..

Drugs Smuggling: గత మూడేళ్లలో రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్! ఈ దాయాది దేశం నుంచే సరఫరా..

Ration card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ తప్పులు చేస్తున్నారా క్షణాల్లో కార్డు రద్దు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!