AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market News: ఈ వారం మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ ఉంటుందా.. ఈ 4 విషయాలు చాలా కీలకం..

Market News: రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine War) యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. యుద్ధ భయాలు ప్రారంభమైన నాటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.

Market News: ఈ వారం మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ ఉంటుందా.. ఈ 4 విషయాలు చాలా కీలకం..
Market News
Ayyappa Mamidi
|

Updated on: Mar 07, 2022 | 6:00 AM

Share

Market News: రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine War) యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. యుద్ధ భయాలు ప్రారంభమైన నాటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. గడచిన రెండు వారాలుగా భారత మార్కెట్లు(Indian Markets) తీవ్ర అనిశ్చితి మధ్య ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాల అంచనాలు సైతం సూచీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటిలో వచ్చే మార్పులు రానున్న వారం పాటు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వీటికి తోడు దేశంలోని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వివరాలు, విదేశీ మదుపరుల ప్రవర్తన, గ్రోబల్ కమోడిటీల రేట్లలో వచ్చే మార్పులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు కీలకంగా మారనున్నాయి. వీటన్నిటిలో ప్రధానంగా వచ్చే వారం(మార్చి 10న) విడుదల కానున్న ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజబ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను మార్చనున్నాయి. మార్చి 7న వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కీలకంగా మదుపరులు పరిగణిస్తారు. దీనికి తోడు మార్చి 15-16 న జరగనున్న యూఎస్ ఫెడ్ మీటింగ్ ప్రపంచ ఎకానమీపై ప్రభావం చూపనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. తాజాగా మార్కెట్లలో జరిగిన కరెక్షన్ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆధాయాలు అంచనాను సూచిస్తోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. యుద్ధం కారణంగా వరుసగా క్రూడ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటికి తోడు అనేక కమోడిటీల రేట్లు భారీగా పెరగటం ద్రవ్యోల్బణాన్ని పెంచటం ఆందోళనలను మరింతగా పెంచుతోంది.

భారత మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల నిష్క్రమణ పరంపర మరింత తీవ్రతరమైంది. ఈ పరిణాల కారణంగా దేశీయ మదుపరులు సైతం ఎక్కువగా ప్రభావితం అవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 2 నుంచి 4 లోపు.. అంటే కేవలం మూడు రోజుల్లో విదేశీ మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 14,721 కోట్లు, డెట్ మార్కెట్ విభాగం నుంచి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్ మార్కెట్ల నుంచి రూ. 9 కోట్లను వెనక్కు తీసుకున్నారు. గడచిన కొంత కాలంగా విదేశీ పెట్టుబడి దారులు తమ సంపదను భారత మార్కెట్ల నుంచి వరుసగా వెనక్కుతీసుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అవి మరింతగా పెరిగాయి. గత వారం ప్రారంభంలో విపరీతమైన నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. తరువాతి రోజు మెల్లగా పుంజుకున్నాయి. కానీ.. అంతర్జాతీయంగా అనిశ్చితి మరింతగా పెరగడం, రష్యాపై వివిధ దేశాల నుంచి ఆంక్షలు పెరగటం, రష్యా అణు విద్యుత్ కేంద్రంపై దాడి వార్తతో పరిస్థితులు మళ్లీ మెుదటికొచ్చాయి.

ఇవీ చదవండి..

Polestar O2: స్టన్నింగ్ లుక్ లో ఎలక్ట్రిక్ స్పోట్స్ కార్.. మతి పోగొడుతున్న ఫీచర్లు..

CHALO CARD: బస్సు చెల్లింపులకు ఛలో​ కార్డ్.. త్వరలో వాటర్ మెట్రో..