ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!

Retirement Schemes: ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేటి కాలంలో సంపాదన మాత్రం పెరగడం లేదు. దీని ప్రకారం రిటైర్మెంట్‌ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!
Bank Robbery
Follow us

|

Updated on: Mar 06, 2022 | 8:33 PM

Retirement Schemes: ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేటి కాలంలో సంపాదన మాత్రం పెరగడం లేదు. దీని ప్రకారం రిటైర్మెంట్‌ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఖర్చులకు మీ వద్ద తగినంత డబ్బు ఉండదు. ఆస్పత్రి ఖర్చులు, అవసరాలకు చాలా కష్టమవుతుంది. అందుకే రిటైర్మెంట్‌ తర్వాత కచ్చితంగా ఆదాయం కావాలి. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి నెలా రెగ్యులర్ ఆదాయాన్ని అందించే కొన్ని ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం అవసరం. అలాంటి పథకాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ప్రధానమంత్రి వయ వందన యోజనగా చెప్పవచ్చు. మీరు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) నుంచి ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)ని కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు 10 సంవత్సరాలకు స్థిరమైన పెన్షన్ రేటును అందిస్తుంది. ఇది రిటైర్మెంట్ చేసిన వారికి చాలా మంచి పథకం. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంలో వడ్డీ ప్రస్తుతం సంవత్సరానికి 7.4% అందుబాటులో ఉంది. ఇది ప్రతి నెలా చెల్లిస్తారు. దీని రేట్లు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. కానీ ఒకసారి పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి కాలానికి రేట్లు నిర్ణయిస్తారు. మరణ ప్రయోజనం కూడా ఉంటుంది. పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు ధర డబ్బు నామినీకి తిరిగి ఇస్తారు. ఈ పథకం మార్చి 31, 2020న ముగిసింది. కానీ దాని విజయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 3 సంవత్సరాల పాటు మార్చి 31, 2023 వరకు పొడిగించింది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పేరు సూచించినట్లుగా రిటైర్మెంట్ చేసిన వ్యక్తుల కోసం ప్రారంభించారు. ప్రస్తుతం త్రైమాసిక ప్రాతిపదికన ఇచ్చే ఈ పథకంపై 7.4% వడ్డీ అందుబాటులో ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టినా సాధారణంగా 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. మీకు కావాలంటే మీరు దానిని 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం. ఇది పెట్టుబడిదారులకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సంపాదించడానికి అవకాశం ఇస్తుంది. ఈ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ ఖాతా కింద ఏకమొత్తం ఖాతాలో జమ చేస్తారు. దీనిపై ప్రభుత్వం 6.6% వార్షిక వడ్డీని ఇస్తుంది. ఈ పథకం 5 సంవత్సరాలు. దీనిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఒకే ఖాతా ద్వారా గరిష్ఠంగా రూ.4.5 లక్షలు.. జాయింట్ ఖాతా ఉన్నట్లయితే గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.

Ration card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ తప్పులు చేస్తున్నారా క్షణాల్లో కార్డు రద్దు..!

అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు తెగ ఇష్టపడుతారు.. పెళ్లికి వెంటనే ఓకె చెబుతారు..!

Children Watch TV: టీవీ నుంచి పిల్లలని తప్పించేదెలా.. ఇలా చేస్తే బెటర్..