Children Watch TV: టీవీ నుంచి పిల్లలని తప్పించేదెలా.. ఇలా చేస్తే బెటర్..
Children Watch TV: ఈ డిజిటల్ యుగం అన్ని పనులని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరు గాడ్జెట్‌లకు అలవాటు పడ్డారు. వీటి ప్రభావం పిల్లలపై కూడా పడింది. మైదానంలో ఆటలు ఆడుకోవాల్సిన
Children Watch TV: ఈ డిజిటల్ యుగం అన్ని పనులని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరు గాడ్జెట్‌లకు అలవాటు పడ్డారు. వీటి ప్రభావం పిల్లలపై కూడా పడింది. మైదానంలో ఆటలు ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుతున్నారు. గంటల తరబడి గాడ్జెట్‌లపై సమయం వెచ్చిస్తున్నారు. ఈ అలవాటు వారి ఆరోగ్యానికి చాలా హానికరం. కరోనా కారణంగా పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు దీని కారణంగా టీవీ, గాడ్జెట్‌లకు అలవాటయ్యారు. ఇంతకు ముందు తల్లిదండ్రులు ఆఫీసుకు, పిల్లలు బడికి వెళ్లేవారు.. ఇప్పుడు అది తలకిందులుగా మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ తరగతుల కారణంగా మొత్తం వ్యవస్థ క్షీణించింది. ఈరోజు పిల్లలకు ఏదైనా సృజనాత్మకత నేర్పించాలన్నా వినోదం పంచాలన్నా టీవీ లేదా ఫోన్ సహాయం తీసుకోవాల్సి వస్తోంది. పిల్లలకు టీవీ చూడడం తప్పనిసరి అయితే ఇందుకోసం కొన్ని ఆరోగ్య సంరక్షణ చిట్కాలను పాటించడం అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.
స్క్రీన్ నుంచి దూరం
పిల్లవాడు మొబైల్ లేదా టీవీ చూడటం అలవాటు పడితే అప్రమత్తంగా వ్యవహరించాలి. పిల్లల కళ్లకు హాని కలిగించని చోట టీవీ పెట్టండి. చైల్డ్, స్క్రీన్ మధ్య ఎక్కువ దూరం ఉండటం చాలా ముఖ్యం. మీ బిడ్డ దీనిని నిరాకరంచిన కంటి సంరక్షణ కోసం మీరు తప్పనిసరిగా ఈ చిట్కాను పాటించాలి.
20-20-20 నియమం
ఈ ఆన్‌లైన్ సమయంలో ఈ 20-20-20 నియమం పిల్లలకు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆన్‌లైన్ తరగతులు, గంటల తరబడి టీవీ చూడటం వల్ల కళ్ళు అలసిపోతాయి. ఈ స్థితిలో కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి 20-20-20 నియమాన్ని అనుసరించండి. ప్రతి 20 నిమిషాల తర్వాత విశ్రాంతి తీసుకోమని పిల్లవాడికి చెప్పండి.
లైట్లు కచ్చితంగా వెలిగే ఉండాలి
ఈ రోజుల్లో పిల్లలు మూసి ఉన్న గదిలో లైట్లు ఆర్పేసి టీవీ చూడటం అలవాటు చేసుకున్నారు. ఈ పద్ధతి వారి కళ్లకు చాలా హాని కలిగిస్తుంది. పిల్లవాడు ఎప్పుడు టీవీ చూస్తున్నాడో ఆ సమయంలో లైట్లు వేయండి. ఇలా చేయడం వల్ల టీవీ నుంచి వెలువడే కాంతి అతని కళ్లపై చెడు ప్రభావం చూపదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ వెలుతురులో టీవీ చూడటం కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది.