AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా..!

Indian Railway: మీరు రైలులో ఎక్కువగా ప్రయాణించే వారైతే ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను ఎప్పుడైనా గమనించారా.. ఈ సంఖ్య మీకు చాలా

Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా..!
uppula Raju
|

Updated on: Mar 06, 2022 | 5:59 PM

Share

Indian Railway: మీరు రైలులో ఎక్కువగా ప్రయాణించే వారైతే ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను ఎప్పుడైనా గమనించారా.. ఈ సంఖ్య మీకు చాలా పెద్ద సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలను తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ నంబర్ మీ రైలు స్థితి, వర్గాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ 5 అంకెల సంఖ్య ఇవన్నీ ఎలా చెప్పగలదో తెలుసుకుందాం. ప్రతి రైలుకి ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఇది దాని గుర్తింపు. ఈ అంకెలు 0 నుంచి 9 వరకు ఉండవచ్చు. 5 అంకెలలో 0 నుంచి 9 వరకు ఒక్కో అంకె ఒక్కో అర్థాన్ని కలిగి ఉంటుంది. 0 అంటే ఈ రైలు ప్రత్యేక రైలు అని అర్థం. (వేసవి స్పెషల్, హాలిడే స్పెషల్ లేదా ఇతర స్పెషల్)

1 నుంచి 4 వరకు అంకెలు అంటే

* మొదటి అంకె 1 అయితే ఈ రైలు చాలా దూరం వెళుతుందని అర్థం. అలాగే ఈ రైలు రాజధాని, శతాబ్ది, జన్ సాధర్, సంపర్క్ క్రాంతి, గరీబ్ రథ్ అయి ఉంటాయి.

* మొదటి అంకె 2 అయితే ఈ రైలు కూడా చాలా దూరం వెళుతుందని అర్థం. ఒకటో నెంబర్‌, రెండో నెంబర్‌ రైళ్లు ఒకే తరగతికి కిందికి వస్తాయి.

* మొదటి అంకె 3 అయితే ఈ రైలు కోల్‌కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం.

* మొదటి అంకె 4 అయితే అది న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైలు అని అర్థం.

5 నుంచి 9 వరకు అంకెల అర్థం

* మొదటి అంకె 5 అయితే అది ప్యాసింజర్ రైలు అని అర్థం.

* మొదటి అంకె 6 అయితే అది MEMU ( Mainline Electric Multiple Unit ) రైలు అని అర్థం.

* మొదటి అంకె 7 అయితే అది DEMU (Diesel Electric Multiple Units) రైలు అని అర్థం.

* మొదటి అంకె 8 అయితే అది రిజర్వ్ చేయబడిన రైలు అని అర్థం.

* మొదటి అంకె 9 అయితే అది ముంబై సబ్ అర్బన్ రైలు అని అర్థం.

మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.45,000 ఆదాయం అందించండి..

Women Health: మహిళలకి ఆ సమయంలో ఈ 7 ఆహారాలు అత్యవసరం.. ఎందుకంటే..?

Cow Dung Scheme: ఆవుపాలే కాదు పేడతో కూడా ఆదాయమే.. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..!

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?